బీజేపీ నేత ,గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ వర్గంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారన్న ఫిర్యాదులతో పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు.
భవానీనగర్, డబీర్‌పురా, రెయిన్ బజార్ పీఎస్‌లలో ఎమ్మెల్యేపై ఫిర్యాదులు నమోదు అయ్యాయి. తమ మనోభావాలు దెబ్బతీశారంటూ కొందరు పోలీస్ స్టేషన్ల ఎదుట నిరసనలకు దిగారు. రాజాసింగ్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పక్కా వ్యూహంతో ఆయన్ని ఆరెస్ట్ చేశారు. పెద్దసంఖ్యలో వెళ్లి ఇంటిని ముట్టడించి ఆయన్ని అరెస్ట్ చేశారు.
https://twitter.com/ANI/status/1561918280683888640?s=20&t=1HB1Tr1Yddk9PFFlzUCRTg