అయ్యప్పస్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అఖిలభారత నాస్తిక సంఘం తెలంగాణ అధ్యక్షుడు బైరి నరేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలం రావులపల్లిలో ఓ వేదికనుంచి అయ్యప్పస్వామిపై హిందువుల మనోభావాలు దెబ్బతేసేలా తీవ్ర వ్యాఖ్యలు చేశాడు నరేష్. దానికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అయింది. ఆగ్రహానికి గురైన అయ్యప్పస్వాములు, హిందూసంఘాలు ఆందోళనకు దిగారు. పలుచోట్ల అతనిపై ఫిర్యాదులు చేశారు. దీంతో హన్మకొండ జిల్లా కమలాపూర్‌లో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. నరేష్ తోపాటు హన్మంతు అనే మరో నాస్తిక సంఘంప్రతినిధినీ అరెస్ట్ తీసుకున్నారు. సంఘానికి చెందిన మరో నాయకుడు రాజేష్ కూడా పోలీసుల అదుపులో ఉన్నాడు. అయితే వారిపై పీడీయాక్ట్ పెట్టి కఠినశిక్ష పడేలా చేయాలని హిందూసంఘాల ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు.