ఎలాంటి అనుమతి పత్రం లేకుండా భారత్ లోకి చొరబడిన చైనా జాతీయుడిని ఐబీ, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ SIB అధికారులు అరెస్ట్ చేశారు.
ఇండో-నేపాల్ సరిహద్దు సమీపంలోని మధుబనిలో అదుపులోకి తీసుకున్నారు. వెంటనే విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖకు సమాచారం ఇచ్చారు. 39 ఏళ్ల అతన్ని జియోజియాంగ్ షిని గా గుర్తించారు. చైనా దక్షిణ తీరంలోని పుజియాన్ ఫ్రావిన్సు నివాసి అని నిర్ధారించారు. చైనా పౌరుడిగా నిర్థారించే గుర్తింపు పత్రాలు అతని దగ్గరున్నాయి. అక్రమంగా ఇండో-నేపాల్ సరిహద్దుద్వారా భారత్ లోకి ప్రవేశించాడు. చైనా పాన్ కార్డ్, నేపాల్ వీసాతో పాటు , మొబైల్ ఫోన్ ఉన్నాయని…భద్రతా, ఏజెన్సీ వర్గాలు తెలిపాయి.
శుక్రవారం సాయంత్రం మధ్వాపూర్లోని గాంధీ చౌక్ మార్కెట్ లో అనుమానాస్పదంగా తిరుగుతుంటే చూశాం. అక్కడ సరిహద్దు పిల్లర్ నెంబర్ 295/2 సరిహద్దు పిల్లర్ ఉంది. అతని కార్యకలాపాలు కూడా అనుమానాస్పదంగా ఉన్నాయి. దీంతో అప్రమత్తమైన ఎస్ఎస్బీ సిబ్బంది పట్టుకున్నారు. అతని దగ్గర పాన్ కార్డు ఉంది. కానీ భారత భూభాగంలోకి వచ్చేందుకు ఉండాల్సిన ఎలాంటి అనుమతి పత్రాలు లేవని భద్రతాబలగాలు తెలిపాయి. స్థానిక పోలీసులు అధికారికంగా అరెస్ట్ చేసి జైలుకు పంపారు. అతను ఇంగ్లిష్ కూడా మాట్లాడుతున్నారని పోలీసులు తెలిపారు. గతంలో కూడా మధుబని సరిహద్దుగుండా చొరబాటుకు ప్రయత్నించిన పలువురిని అరెస్ట్ చేశారు. ఉత్తరబీహార్ లోని ప్రధాన భాగం నేపాల్ తో సరిహద్దును కలిగి ఉంటుంది.