దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తూ…. ఘోరం జరిగింది. ఆర్మీ హెలికాప్టర్ ఐఏఎఫ్ ఎంఐ-17V5 తమిళనాడు కూనూరులో కుప్పకూలింది. 14 మంది ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్లో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ , కుటుంబసభ్యులు ఉన్నారు.ఈ ప్రమాదంలో ఏడుగురు మృతిచెందగా… ఇద్దరు నీలగిరి జిల్లాలోని వెల్లింగ్టన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గల్లంతైన వారికోసం గాలిస్తున్నారు. ప్రమాద ఘటనను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారికంగా నిర్దారించింది.
హెలికాఫ్టర్లో రావత్, ఆయన సతీమణి మధులిక సహా… బ్రిగేడియర్ ఎల్ఎస్ లిడ్డర్, లెఫ్టినెంట్ కల్నల్ హర్జిందర్ సింగ్, నాయక్ గుర్సేవక్ సింగ్, నాయక్ జితేందర్ కుమార్, లాన్స్ నాయక్ వివేక్ కుమార్, లాన్స్ నాయక్ బి సాయి తేజ, హవల్దార్ సత్పాల్ ఉన్నట్టు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే సైన్యం, స్థానిక పోలీసులు సహాయక చర్యలు చేపట్టింది.
ప్రమాద విషయం తెలిసిన వెంటనే రక్షణశాఖా మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆర్మీ అధికారులను ఆరా తీశారు. అటు మోదీ రాజ్ నాథ్ సింగ్ తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ప్రధాని నేతృత్వంలో కేబినెట్ అత్యవసరంగా సమావేశమైంది. ప్రమాదంపై కాసేపట్లో పార్లమెంట్లో రాజ్ నాథ్ ప్రకటన చేసే అవకాశం ఉందని తెలిసింది.
సాంకేతిక లోపం వల్లే హెలికాఫ్టర్ కుప్పకూలిందని చెబుతున్నా… భారత వాయు సేన (ఐఏఎఫ్) దర్యాప్తునకు ఆదేశించింది. హెలికాప్టర్ తమిళనాడులోని కూనూరు సమీపంలో ప్రమాదానికి గురైంది. అందులో సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ ఉన్నట్లు ఐఏఎఫ్ అధికారిక ఖాతాలో ట్వీట్ చేసింది.
video link :