ఉత్కంఠగా సాగిన ఫిఫా వరల్డ్ కప్-2022 ఫైనల్ లో ఫ్రాన్స్ పై విజయం సాధించి చాంపియన్ గా నిలిచింది అర్జెంటినా. ఫిఫా ప్రపంచ కప్ టైటిల్ కోసం ఎదురుచూస్తున్న స్టార్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ నిరీక్షణకు తెరపడింది.
4-2 (3-3)తో ఫ్రాన్స్‌ను ఓడించి తమ ఖాతాలో మూడో ప్రపంచ కప్ ను వేసేసుకుంది అర్జెంటీనా. ఖతార్‌లో జరిగిన ఫిపాప్రపంచ కప్-2022ను అర్జెంటీనా గెలుచుకున్న తర్వాత లియోనెల్ మెస్సీ తన రెండవ గోల్డెన్ బాల్ అవార్డులను గెలుచుకున్న మొదటి ఆటగాడిగా నిలిచాడు.గతంలో 1978, 1986 ల్లోనూ ట్రోఫీని గెలుచుకుంది అర్జెంటీనా. 36 సంవత్సరాల తర్వాత మూడు లేదా అంతకంటే ఎక్కువ ప్రపంచ కప్‌లలో నాల్గవ దేశంగా, మూడు టైటిళ్లను గెలుచుకున్న ఏకైక దేశంగా అర్జెంటీనా అవతరించింది.