మనలో కొంతమందికి విస్తారంగా డ్రెస్ పిచ్చి ఉంటుంది. తరచుగా దుస్తుల కొనడం, ఆధునిక మోడల్స్ ఫాలో అవ్వడం అలవాటుగా ఉంటుంది. దుస్తులు ధరించడం మనిషికి తప్పనిసరి. అందుచేత డ్రెస్ కొనడం అనేది కూడా అంతే తప్పనిసరి.
కానీ కొత్త మోడల్స్ మోజు లో విపరీతంగా డ్రెస్ లు కొనడం కొంప ముంచుతోంది. దుస్తుల పరిశ్రమకు సంబంధించి ఐక్యరాజ్యసమితి ఒక అధ్యయనం చేపట్టింది. దీని ప్రకారం తయారు చేసిన దుస్తుల్లో అన్నిటిని ప్రజలు కొనడం లేదు. దాదాపు 30% దుస్తులు నేరుగా చెత్త కుప్పలమీదకి వచ్చేస్తున్నాయి. కొనేవారు లేక వాటిని చెత్తగా పడేయవలసి వస్తుంది. మరోవైపు కొన్న తర్వాత చాలా మంది ..తక్కువ సమయం మాత్రమే ధరిస్తున్నారు. ఈ లోగా మరో ట్రెండ్ వస్తే ఈ దుస్తులు బయట పడేసి కొత్త డ్రెస్ కొనుకుంటున్నారు. దీంతో ఈ దుస్తులు కూడా చెత్తగా మారుతున్నాయి.
ఐక్యరాజ్యసమితి అధ్యయనం ప్రకారం ప్రపంచంలో ప్రతి సెకండ్ కు ఒక ట్రక్కు బట్టల్ని బయట పడేస్తున్నారు. దీన్ని బట్టి ఒక గంటకు ఒక రోజుకి ఎన్ని టన్నుల చెత్త చేరుతుందో అర్థం చేసుకోవచ్చు. మొత్తంగా చూసుకుంటే సగటున 57% దుస్తులు .. వివిధ మార్గాల లో చెత్తకుప్పలకి వచ్చేస్తాయి.
ఇదంతా ఒక ఎత్తైతే తేలికగా మట్టిలో కలిసిపోయే కాటన్ వంటి దుస్తులని ప్రజలు ధరించడం లేదు. కొత్త ట్రెండు మోజుతో పాలిస్టర్ సిల్క్ వంటి బ్రాండ్లను ఇష్టపడుతున్నారు. వీటికి ప్లాస్టిక్ ను కలపడం వల్ల ఈ దుస్తులు త్వరగా నేల లో కలిసిపోవడం లేదు.
దీంతో భయంకరమైన కాలుష్యానికి ఈ దుస్తులు కారణం అవుతున్నాయి. ప్రజలే ముందుకు వచ్చి స్వచ్ఛందంగా ఈ దుస్తుల వినియోగం మీద నిర్ణయం తీసుకోవాలి అని ఐక్యరాజ్యసమితి సూచిస్తున్నది.