సెక్యూలరిజం పేరుతో ఇన్నాళ్లూ జరిగింది చాలు. మాకు మా భారతీయ “సర్వ ధర్మ సమభావన” అందించలేని ఈ విదేశీ సెక్యూలరిజం వద్దు. మీ సెక్యూలరిజం పాఠాలు ఎవరికి చెప్పాలో వారికి చెప్పే దమ్ము ధైర్యం లేక సహనశీలురు అయిన హిందూ సంస్థలను, ఆ సంస్థలను సమర్ధించే హిందువులను ఆడిపోసుకుంటున్నారు.
మీ తెలివితక్కువ తనం వల్ల ఇంకా సాధారణ హిందువులు మీ సెక్యూలర్ మేధావులకు దూరం జరిగి నిజాలు తెలుసుకుంటున్నారు.
హిందువులు మతోన్మాదులు అంటారేమిటీ.. మోదీజీని బీజేనీని తిట్టేవారు హిందువులే ఎక్కువమంది (ఎందుకు తిడుతున్నారు అంటే ఆయనచేస్తున్న మంచిపనులు నచ్చక అనే అనాలి )….. కమ్యూనిష్టులందరూ మొదట హిందువులే. అసలు హిందూ ధర్మాన్ని పాటించని వారు కూడా హిందువులే. మతం ఈజీగా మార్చుకున్నదీ హిందువులే. హిందువులలో మతోన్మాదం ఎక్కడుంది?
హిజాబ్ వివాదాన్ని సమర్ధించిన వారు సగం మంది హిందువులే. మతోన్మాద హింసలకి బలైనవారూ హిందువులే ..
షహిన్ బాగ్ భైంసాలలో రాళ్ళు దెబ్బలు తిన్నది హిందువులే. తీవ్రవాదుల బాంబుల దాడిలో చచ్చిపోయింది హిందువులే.
అయినా హిందువులదే మతోన్మాదమా ?
ఒకప్పడు అలికిన ఇళ్ళు పసుపు కుంకుమ, తెల్లని ముగ్గులతో కళకళ లాడిన ఊళ్ళలో జనం శిలువ ధరించి చర్చిలకి పరుగెత్తే మతం మారిన హిందువులే కదా.
మతోన్మాదం ఎవరిది ?
హిందువులకు మతోన్మాదమా ?
పుల్వామా లో సైనికుల హత్య, కాశ్మీర్ లో ప్రొఫెసర్ ఒంట్లో గుళ్లు దిగబడ్డాయి.
గుజరాత్ లో కిషన్ ని, బంగ్లాదేశ్ లో ఇస్కాన్ సభ్యుల్ని, మహారాష్ట్రలో సాధువులను ఎవర్ని చంపినా నోరెత్తని హిందువులు మతోన్మాదులా ?
రథాలు తగలపడినా, రాముని విగ్రహం తలవిరగ్గొట్టినా, దేవీ దేవతలను దుర్భాషలాడినా నోరు మెదపని, చట్టానికే న్యాయం అప్పచెప్పిన హిందువులు మతోన్మాదులా ?
ఎన్ని విషాదాలు ఎన్నిఅకృత్యాలు, చివరకు స్కూల్ రూల్స్ గౌరవించాలని కోరుకోవడం మతోన్మాదమా ?
గుడి నియమాలు బడి నియమాలు మేము లెక్కచేయం అంటే. ఆవేదనతో ఆక్రోశంతో ఎదురు తిరిగితే కొందరు హిందువులు మతోన్మాదులా ?
ఏ రూల్స్ అయినా హిందువులకే మాకు కాదు అని అల్లరి చేసేవారిని సమర్ధించే వారూ హిందువులే.
హిందువులకు మతోన్మాదం ?
ఎవరిది మతోన్మాదం ?
ఆనాడు పదవిలో ఉండి నిద్రపోయారు. ఇపుడు కూడా నిద్రపోయే హిందువులు మతోన్మాదులు అని అన్నారా దేవేగౌడ ?
తమాషా ఏంటంటే ఈ దేవేగౌడ గారు కూడా హిందువే. ఈ పోస్ట్ చదివిన అందరూ నిజంగా ఆత్మసాక్షిగా చెప్పండి.
Courtesy :- Chada Shastry