అవుననే ప్రపంచ చరిత్ర చెబుతున్నది, చరిత్రలో మనం మరింత లోతుగా వెళ్లకుండా కేవలం మూడు నాలుగు వందల సంవత్సరాల ప్రపంచ చరిత్రను గమనిస్తే మనకు అర్థమయ్యేది అదే. 1893 నాటికే అమెరికా ఒక శక్తివంతమైన ఆర్థిక శక్తిగా, సైనిక శక్తిగా , శాస్త్ర సాంకేతిక రంగాలలో అద్భుత ప్రగతి సాధించిన దేశంగా అవతరించింది. రష్యా విప్లవం తర్వాత, రష్యా కూడా అదే దిశలో ప్రయాణం చేస్తూ అమెరికా ను సవాలు చేస్తూ ఎదిగింది, పారిశ్రామిక విప్లవం తర్వాత ఐరోపా ఖండం లోని ఇంగ్లాండ్, ఫ్రాన్స్ , ఫొర్చ్ గ్రీస్ తదితర దేశాలు తమ వ్యాపారం ప్రపంచంలో అనేక దేశాలలో ఏర్పాటు చేసుకుని పోటీపడుతూ రెండు ప్రపంచ యుద్ధాలు కు తెరలేపారు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఐరోపా దేశాలు క్రమంగా వెనక్కి వెళ్లిపోయాయి , తరువాత అమెరికా, రష్యా ఆ తదుపరి చైనా తెరపైకి వచ్చాయి. రష్యాలో కమ్యూనిజం1991డిసెంబర్ 25 న కుప్పకూలిన తర్వాత అమెరికాఏక ధ్రువ ప్రపంచం గా మారిపోయింది, ఆ తదుపరి కాలంలో దానిని సవాలు చేసే విధంగా చైనా ఎదుగుతూ వచ్చింది. ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అనేక సమస్యలకు అమెరికా, రష్యా లే ప్రధాన కారణం. దానికి ఒక ఉదాహరణ చూద్దాం 1979 డిసెంబర్ 24 న ఆఫ్ఘనిస్థాన్లో కమ్యూనిస్ట్ పాలకులను ఆసరాచేసుకొని రష్యా ఆక్రమణ చేసింది, ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ పక్కనే ఉన్న పాకిస్థాన్ లో అమెరికా ఆధిపత్యం కొనసాగుతోంది దానికోసం ఆఫ్ఘనిస్థాన్లో స్థావరం ఏర్పాటు చేసుకునేందుకు రష్యా ప్రయత్నించింది అమెరికా దాన్ని చూస్తూ ఊరుకోలేదు దాని పరిణామం తాలిబన్ల సృష్టి జరిగింది ఒక రకంగా ఇస్లాం సామ్రాజ్యం నిర్మాణం చేయాలనే ప్రయత్నాలకు పురుడు పోసింది. 1979 నుండి 1989 వరకు తాలిబన్లతో రష్యా యుద్ధం చేస్తూనే వెనక్కివెళ్లిపోయింది. అతదుపరి ఆ తాలిబాన్లను అణిచి వేయడానికి అమెరికా దశాబ్దాలుగా ఆఫ్ఘనిస్థాన్లో సైనిక స్థావరాలు ఏర్పాటు చేసుకుని ఉన్నది చివరకు వెనక్కి వెళ్ళి పోవలసిన పరిస్థితులు వచ్చాయి, 2021 జూలై నుండి దశలవారీగా ఆఫ్ఘనిస్తాన్ నుండి వెనక్కి వెళ్ళి పోతూ తాలిబాన్లను ఒక తిరుగులేని శక్తిగా నిర్మాణం చేసి ఆఫ్ఘనిస్తాన్ సమస్యను మళ్ళీ మొదటికి తెచ్చింది.
, సామ్రాజ్య వాద శక్తిగా చైనా అమెరికా తో పోటీ పడుతున్నదా?
ఇప్పుడు అటువంటి సామ్రాజ్యవాద శక్తిగా ఎదిగిన చైనా టిబెట్ మొదలైన దేశాలను తన ఆక్రమణలో తెచ్చుకుని ప్రపంచానికి కొత్త సమస్యలు తెచ్చిపెడుతున్నది, అమెరికా , రష్యా తర్వాత చైనా ఎట్లా ఒక విధ్వంసక శక్తి గా ప్రపంచం ముందుకు వచ్చిందో కూడా గమనించవలసిన అవసరం ఉంది.భారతదేశాన్ని కూడా చైనా సైద్ధాంతికంగా, ఆర్థికంగా, ఎట్లా ప్రభావితం చేసుకొంటూ వస్తున్నదో గమనించవలసిన అవసరం ఉంది, 1962యుద్ధం దాని పరాకాష్ట . భారత భూభాగాలను ఆక్రమణకు తాజా ఉదాహరణ లద్ధక్. ఈ విషయాలు జాగ్రత్తగా గమనించ వలసిన అవసరం ఉంది.
చైనా పూర్తిగా అభివృద్ధి చెందిన దేశంగా 2050 నాటికి అవతరిస్తుందని కానీ దానిని 2035 నాటికే సాధిస్తామని చైనా అధ్యక్షుడు ప్రకటించి దిశా నిర్దేశం చేశాడు. కమ్యూనిస్టు చైనా ఇప్పుడు ఒక దోపిడీ దేశంగా ప్రపంచంలో ప్రసిద్ధి పొందింది. కరోనా వైరస్ పుట్టుక చైనాలో జరిగిందని బలమైన వాదన ఉంది, దానిపైన పరిశోధన చేయాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం కోరింది, దానిపై ఆగ్రహించిన చైనా ఆస్ట్రేలియా కు 3 మిలియన్ డాలర్ల ఎగుమతులు రద్దు చేసింది అంటే ఆర్థిక దాడి చేసింది, అట్లాగే అమెరికా క్షిపణి రక్షణ వ్యవస్థ ఏర్పాటు చేసుకునేందుకు అంగీకరించిన సియోల్ పై 2017 చైనాఆర్ధిక ప్రతీకారం తీర్చుకొంది. అట్లాగే చైనా అసమ్మతి నాయకుడు యు జియా బోకు కు శాంతి నోబెల్ బహుమతి ప్రకటించినందుకు నార్వే దేశం పై కూడా ఆర్థిక ప్రతీకారం తీర్చుకుంది. చైనా ఆక్రమణలు రెండు రకాలుగా ఉంటాయి 1) తన ప్రత్యర్థుల పైన 2 )తన చారిత్రక విరోధుల పైన ఉంటుంది, ఈ మధ్యకాలంలో దూకుడు పెంచింది, ఒక ప్రక్క ప్రపంచదేశాల ఒత్తిడిని ఎదుర్కొంటూనే తన పోరాట పటిమను పెంచుకుని భారత్, ఆస్ట్రేలియా, జపాన్,తైవాన్ మరియు వియత్నామ్ దేశాలపై మాటిమాటికీ బెదిరిస్తూ దాడులు చేస్తున్నది. తాను సూపర్ పవర్ గా ఎదగాలన్న ఆకాంక్షల పై కరోనా ఒకరకంగా నీళ్లు చల్లినట్లు అయ్యింది.
అమెరికా ఎత్తుగడ బెడిసి కొడుతున్నదా ?