పదేళ్ల బాలుడిపై అత్యాచారం చేసిన 25 ఏళ్ల అరబిక్ టీచర్ ను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. దారుల్ ఉలూమ్ మదర్సా టీచర్ షోయబ్ అక్తర్ తమ కుమారుడిపై అత్యాచారం చేశాడంటూ బాధితుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మైలార్ దేవ్ పల్లి పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. నిందితుడు బిహార్ కు చెందిన వాడు. పదిరోజులు వరుసగా బాలుడిపై అత్యాచారం చేశాడు. వెన్నునొప్పి ఎక్కువవడంతో బాలుడు ఏడుస్తూ జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పాడు. అతని ప్రవేట్ భాగాలు వాయడంతో పాటు రక్తస్రావం అయిన గాయాలను వారు గుర్తించారు. ఆందోళన చెందిన తల్లిదండ్రులు స్థానికులతో కలిసి మదర్సాముందు నిరసనకు కూడా దిగారు. తరువాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండు నెలలక్రితమే దక్షిణాఫ్రికానుంచి హైదరాబాద్ తిరిగి వచ్చింది బాలుడి కుటుంబం. కొద్దిరోజుల క్రితమే మదర్సాలో చేర్చింది. బాలుడికి వైద్య పరీక్షలు నిర్వహించిన పోలీసులు.. అక్తర్ ను అరెస్ట్ చేశారు.
అక్తర్ గతంలో ఇతర పిల్లలపట్ల ఇలాగే చేశాడా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. విద్య నేర్పించాల్సిన గురువులే మదర్సా వేదిగ్గా ఇలాంటి చర్యలకు పాల్పడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. గతనెల 27న ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురి జిల్లా నుండి 8 ఏళ్ల మదర్సా విద్యార్థినిపై 52 ఏళ్ల మతగురువు అత్యాచారానికి పాల్పడిన సంగతి తెలిసింది. ఇక గతేడాది ఆగస్టులో కర్ణాటకలోని తుమకూరుకు చెందిన ఓ మదర్సా టీచర్ మైనర్ ను లైంగికంగా వేధించిన ఆరోపణలు రుజువు కావడంతో 11 ఏళ్ల జైలుశిక్షపడింది.