నరసాపురం ఎంపీ రఘురామ బెయిల్ పిటిషన్ కొట్టివేయాలని సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ఎంపీ రఘురామ కుట్ర పన్నారని కౌంటర్లో పేర్కొంది. రెండు వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకు రఘురామ ప్రయత్నించారంది.. ఇలాంటి సమయంలో ఫిర్యాదు దాఖలయ్యే వరకు ప్రభుత్వం చేతులు ముడుచు కూర్చోదని ప్రభుత్వం తెలిపింది. వాక్ స్వాతంత్ర్యం హక్కు పేరుతో హద్దులు మీరకూడదని, ప్రజల మధ్య చీలికతెచ్చే ప్రయత్నాలు సరికాదని వ్యాఖ్యానించింది.. ఎంపీ ప్రకటనలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే రాజద్రోహం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపింది.
లోక్ సభ స్పీకర్ ఓంబిర్లాతో రఘురామకృష్ణంరాజు కుటుంబ సభ్యులు భేటీ అయ్యారు..రఘురామరాజు పై ఏపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల ను లోక్ సభ స్పీకర్ కు కుటుంబసభ్యులు వివరించారు..
ఏపీ సి.ఐ.డి చర్యలను, కోర్టు ధిక్కారాన్ని లోక్ సభ స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు..