మరోకధ మరోవ్యధ
మధ్యప్రదేశ్‌కు చెందిన కీర్తి జైన్ మూడేళ్ల క్రితం పొరుగున ఉన్న వసీం ఖురేషితో కలిసి పారిపోయింది
మూడు రోజుల క్రితం, ఆమె విషం (అల్యూమినియం ఫాస్ఫైడ్ అకా సెల్ఫోస్ లేదా సాల్ఫోస్) తీసుకుని ఆసుపత్రిలో మరణించింది.
ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, వృత్తుల్లోనూ మనం పూర్తిగా ములిగిపోయి పిల్లలని పట్టించుకోకపోతే జరిగే అనర్ధాలకు మనం అంటే తల్లి తండ్రులం కూడా బాధ్యత వహించాలి. పిల్లలకు ఇళ్లల్లో తల్లి తండ్రులు వద్ద పూర్తి చనువు లేకపోవడం, పెరుగుతున్న వయసుతో పాటు వస్తున్న తమ శారీరక మానసిక ఇబ్బందులను పంచుకునేంత చనువు తల్లి తండ్రులు ఇవ్వలేకపోతే ఇదిగో ఇలానే ఎవడో రోడ్డున పోయే వాడు నాలుగు స్వాంతన మాటలు చెప్పి లోబరుచుకుంటాడు.
కీర్తి కథ చదవండి :
కీర్తి గునాలో ఆర్ధికంగా బాగానే ఉన్న సాంప్రదాయ జైన కుటుంబానికి చెందినది. ఇది వివిఐపి అంటే సింధియా కుటుంబానికి చెందిన నియోజకవర్గం. వసీమ్ ఆర్ధిక వనరులు లేని కుటుంబం నుండి వచ్చాడు. వీళ్ళ ఇంటికి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉండేవాడు. అతను ఆమె మైనర్ గా పాఠశాలలో చదువుతున్న రోజుల్లోనే లైన్ వెయ్యడం ప్రారంభించాడు.
కీర్తికి 18 సం.లు నిండిన 2-3నెలలలోనే వసీం తో లేచిపోయింది. కూతురు వాడితో తిరుగుతోంది అన్న సంగతి అమ్మాయి లేచిపోయే దాకా వీళ్లకు తెలియలేదు. కీర్తికి ఆమె అన్నయ్య , తల్లిదండ్రులు, జైన్ గురువులు ఎవరు ఎంత నచ్చ చెప్పిన కీర్తి వినలేదు. కీర్తి అన్నయ్య లవ్ జిహాద్ సంగతి చెప్పినా కీర్తి తలకి ఎక్కలేదు. పై పెచ్చు మీకు వసీం గురించి తెలియదు, నా కోసం తను నాన్ వెజ్ తినను అని చెప్పాడు, నేను పేరు కానీ మతం కానీ మార్చుకో అవసరం లేదు అని చెప్పాడు అని చెప్పింది. కీర్తి తల్లి తండ్రులు పోలీస్ కంప్లైంట్ ఇస్తే కోర్టులో నేను ఇష్టపడే లేచిపోయాను అని కీర్తి చెప్పడంతో తల్లితండ్రులు కీర్తి మీద ఆశ వదులుకున్నారు. కీర్తి నిఖా చేసుకొని జైనాబ్ గా పేరు మార్చుకొని వేరే ఊర్లో కాపురం పెట్టింది.
వసీంకి ఉద్యోగం సద్యోగం ఏమీ లేవు. వారి కుటుంబం ఆర్ధికంగా ఇబ్బందులు పడుతూ ఉండటంతో కీర్తి తల్లి తండ్రులను సంప్రదించింది. అప్పటికి ఆమె గర్భవతి. కీర్తి తల్లిదండ్రులే రెండు లక్షలు ఖర్చు చేసి డెలివరీ కి వైద్యం చేయించి వాడిని వదలి మాతో వస్తే నీ బాగోగులు చూసుకుంటాం లేకపోతే ఇక మీదట నువ్వు మమ్మల్ని కాంటాక్ట్ చెయ్యకు అని చెప్పి వచ్చేసారు. కానీ కీర్తి ఏ నిర్ణయం తీసుకోలేదు. ఆడపిల్ల పుట్టి ఖర్చులు పెరగడంతో కీర్తి ఇంకా తరుచుగా తల్లి తండ్రులు సహాయం కోసం అడగడం ప్రారంభించింది. కానీ అప్పుడు ఆలోచించడం మొదలు పెట్టింది అసలు ఆదాయం లేని వసీం అంత ఖరీదైన బైకులు మీద తనని షికార్లు ఎలా తిప్పేవాడో తనకి అర్ధం కాలేదు.
రెండో కరోనా వేవ్ సమయంలో కీర్తి కుటుంబానికి కీర్తి నుండి ఏ సమాచారం లేదు. గత వారం మాత్రమే కీర్తి అన్నకి స్థానిక పోలీసు ఫోన్ చేసి మీ సిస్టర్ బాడీ చూడడానికి హాస్పిటల్ కి రమ్మనమని చెప్పాడు. కీర్తి అప్పటికే చనిపోయింది. కీర్తి కుటుంబ సభ్యులు కీర్తి బాడీ తీసుకొని జైన్ పద్దతి ప్రకారం అంత్యక్రియలు నిర్వహిద్దాం అనుకుంటే వసీం కుటుంబ సభ్యులు అడ్డుపడ్డారు. పోలీసులు కీర్తి మీ కోడలు అనే ఆధారాలు ఉంటే చూపించమంటే వారి వద్ద ఏ ఆధారాలు లేకపోవడంతో కీర్తి కుటుంబ సభ్యులే అంత్యక్రియలు నిర్వహించారు.
వరకట్నం వేధింపులు కింద కీర్తి కుటుంబ సభ్యులు వసీం కుటుంబం పై కేసు పెట్టారు వసీం కుటుంబ సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కీర్తి హాస్పిటల్ బెడ్ మీద వుండదగా తీసిన విడియోగా చెప్పబడుతున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. దానిలో తనంత తానే పొరపాటున విషం తాగానని చెప్పినట్లు ఉంది వసీం ఫ్యామిలీ కేసు నుండి తప్పించుకుందుకు కీర్తి చేత అలా చెప్పించి వుంటారు అని కీర్తి అన్నయ్య ఆరోపించాడు. బిడ్డ వసీం కుటుంబం వద్దే ఉంది. కేసు నడుస్తోంది.
సినిమాల ప్రభావం, భవిష్యత్ అంటే భయం లేకపోవడం, రోజూ పేపర్లలో, సోషల్ మీడియాలో ఇటువంటి కధలు వస్తున్నా తెలివి తెచ్చుకోకుండా మనమే చాలా తెలివైనవారం అనే అహంభావం ఆడపిల్లల జీవితాల్ని నాశనం చేస్తున్నాయి.
స్వాతి గోయల్ శర్మ సమాచారం ఆధారంగా రాసినది.
ఈ పోస్ట్ చదివి ఒక్క ఆడపిల్ల తనను తాను రక్షించుకున్నా ఈ పోస్ట్ ఉద్దేశ్యం నెరివేరినట్లే..
…చాడా శాస్త్రి