కర్ణాటకలో మరొక లవ్ జిహాద్ కేసులో భయంకరమైన సంఘటన చోటుచేసుకుంది. మహ్మద్ ఇజాజ్ తన భార్య అపూర్వ పురాణిక్ అలియాస్ అర్ఫా భానుని దారుణంగా కత్తితో పొడిచి చంపడానికి ప్రయత్నించాడు. ఇజాజ్ తనకంటే ముందు వేరొకరిని వివాహం చేసుకున్నాడని, ముగ్గురు పిల్లలకు తండ్రి అని తెలిసి విడాకులు కోరింది ఆమె.
నివేదికల ప్రకారం, 30 ఏళ్ల మహ్మద్ ఇజాజ్ తన రెండవ భార్య, 26 ఏళ్ల అపూర్వ పురాణిక్ తనను విడిచిపెట్టినందుకు ప్రతీకారంగా కొడవలితో 23 సార్లు పొడిచాడు. ఈ ఘటన కర్ణాటకలోని గడగ్ జిల్లాలో గురువారం చోటుచేసుకుంది. బాధితురాలు నగరంలోని స్థానిక ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతోంది.
ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్న ఇజాజ్, MBA పూర్తి చేసిన నగరంలోని చాలా గౌరవప్రదమైన బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అపూర్వతో సంబంధం కలిగి ఉన్నాడు. ఇజాజ్ తన చదువు కొనసాగిస్తున్నానని, ఖాళీ సమయాల్లో ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్నానని అపూర్వకు అబద్ధం చెప్పాడు. 2018లో అమ్మాయి కుటుంబ సభ్యులకు వ్యతిరేకంగా ఈ జంట ప్రేమ వివాహం చేసుకున్నారు. వివాహం తర్వాత అపూర్వ ముస్లింగా మారి తన పేరును అర్ఫా భానుగా మార్చుకుంది. బురఖా, హిజాబ్ ధరించడం వంటి ఇస్లామిక్ సంప్రదాయాలను అనుసరించింది. అపూర్వ మాంసాహారం కూడా తీసుకోవడం ప్రారంభించింది. ఇజాజ్ ఆమెను ఇస్లాంలోకి మారమని బలవంతం చేయడంతో హిందూ సంప్రదాయాలను పూర్తిగా విడిచిపెట్టింది. అపూర్వ కుటుంబం కూడా ఆమె కుమార్తెతో రాజీపడి, కుమార్తె తోపాటు ఇజాజ్‌తో సత్సంబంధాలను కొనసాగిస్తున్నారు. ఆ దంపతులకు ఒక కుమారుడు కూడా ఉన్నాడు.
కొన్ని నెలల తరువాత ఇజాజ్ తన మొదటి వివాహం గురించి సమాచారాన్ని దాచిపెట్టాడని తెలుసుకుంది. ఇజాజ్ అపూర్వతో పెళ్లికి ముందే ముస్లిం మహిళను వివాహం చేసుకున్నాడు, ముగ్గురు పిల్లలకు తండ్రి. ఆమె ఇజాజ్ మొదటి వివాహం గురించి తెలుసుకున్నా తర్వాత అపూర్వ ఇజాజ్‌ను విడిచిపెట్టి తన రెండేళ్ల కొడుకుతో పాటు గడగ్ జిల్లాలోని తన తల్లిదండ్రుల నివాసానికి వెళ్ళింది. ఇజాజ్ తనను హింసించడం ప్రారంభించడంతో ఆమె స్థానిక కోర్టులో విడాకుల కోసం దాఖలు చేసింది.
ఇజాజ్‌ను విడిచిపెట్టిన దాదాపు నాలుగు నెలల తర్వాత గురువారం అపూర్వ తన పొరుగువారితో కలిసి ద్విచక్ర వాహనం నడపడం నేర్చుకునేందుకు గ్రౌండ్‌కి వెళ్లిన విషయం తెలుసుకొని నిందితుడు తన భార్యను వెంబడించి దాదాపు 23 సార్లు కత్తితో పొడిచాడు.
వెంటనే ఆమెను నగరంలోని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఇంతలో ఇజాజ్ సంఘటన స్థలం నుండి తప్పించుకున్నాడు. మహ్మద్ ఇజాజ్ కోసం గడగ్ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
https://twitter.com/Mohan_HJS/status/1502193834024837120?s=20&t=PtROPPYAgP4uXxpx1OjlOQ
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్‌స్క్రైబ్ చేయండి.)