గుజరాత్ లో ఘోరం జరిగింది. బోర్సాద్ లో రోడ్డుమీద పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులపైకి ట్రక్కును ఎక్కించారు దుండగులు. ట్రక్ నడుపుతున్న వ్యక్తులు అనుమానాస్పదంగా ఉండడంతో పోలీసులు దాని ఎదురుగా నిలబడి ఆపే ప్రయత్నం చేశారు. కానీ దుండగులు వేగంగా పోలీసుపై నుంచి వాహనాన్ని పోనిచ్చాడు. పోలీసులు భయంతో పక్కకు తప్పుకున్నారు. ఓ కానిస్టేబుల్ కు వాహనం బలంగా తగిలింది.
వాహనం వేగానికి కానిస్టేబుల్ కిరణ్ రాజ్ దూరంగా ఎగిరిపడ్డాడు. అక్కడివాళ్లు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతను చనిపోయినట్టు వైద్యులు ప్రకటించారు. పరారీలో ఉన్న ట్రక్ డ్రైవర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. 24 గంటల వ్యవధిలోనే రెండు ఘటనలు జరగటంతో కలకలం రేగింది.
https://twitter.com/ANI/status/1549673051352010752?s=20&t=hToeEB_ruirE7xIPkRvpyw
బుధవారం మైనింగ్ మాఫియా ఓ లేడీ ఇన్స్ స్పెక్టర్ ను ట్రక్కుతో తొక్కించి చంపారు. అటు హర్యానాలోనూ మైనింగి మాఫియా ఓ అధికారిని పొట్టనబెట్టుకున్న సంగతి తెలిసిందే.