వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటికే అన్ని సర్వేలు బీజేపీకి అనుకూలంగా చూపిస్తున్నప్పటికీ.. మమతా బెనర్జీ మాత్రం మరోసారి అధికారం తనదేనంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే దీదీని సొంత పార్టీ నేతలే వీడి బీజేపీలోకి వెళ్లడంతో.. మైనార్టీల ఓట్లన్నీ తనకే పడుతాయని నమ్మకంతో ఉంది. అయితే అనూహ్యంగా ఎంఐఎం ఏడు స్థానాల్లో బరిలో దిగుతుండటంతో.. ఆ ఏడు స్థానాల్లో టీఎంసీకి గెలుపు అంత ఈజీ కాదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం ఏడు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ ఓవైసీ కూడా స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ఇథార్, జాలంగి, సాగర్ ధిగి, భరత్ పూర్, మలాటిపూర్, రౌతా, అసన్ సోల్ ఉత్తర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులు పోటీ చేయనున్నారు. వారి పేర్లను కూడా ఏఐఎంఐఎం పార్టీ అధికారిక ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
https://twitter.com/aimim_national/status/1379320444243730433