isrభారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మరో ప్రయోగానికి సిద్ధమైంది. నవంబరు 26న ఉదయం 11.56 గంటలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి PSLV-C54/EOS-06 ప్రయోగాన్ని చేపట్టనుంది. ఈ ఏడాది ఇస్రో చేపట్టననున్న ఆఖరి ప్రయోగం ఇదే.ఈ ప్రయోగం ద్వారా మొత్తం 9 ఉపగ్రహాలను నింగిలోకి పంపుతారు. ఇందులో 960 కేజీల ఓషన్‌శాట్-3తో పాటు మరో ఎనిమిది నానో ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెడతారు. ఇందులో భూటాన్‌కు చెందిన ఓ శాటిలైట్ ‘భూటాన్‌శాట్’ కూడా ఉంది
30 క్యూబిక్ సెంటీమీటర్ల భూటాన్ షాట్ ఉపగ్రహం .. భూటాన్ మీదుగా ఎగురుతూ భూమి ఉపరితలం చిత్రాలను తీస్తుంది. దీని బరువు 15 కిలోలు ఉంటుంది. ఇది భూటాన్ ఉపరితలాన్ని రోజుకు కనీసం రెండు మూడు సార్లు కవర్ చేస్తుంది