యోగీ ఇలాకాలో మరో ఎన్కౌంటర్.. ఈ సారి షూటర్ వంతు
గ్యాంగ్స్టర్స్ అన్న పేరు లేకుండా చేస్తున్నారు యూపీ సీఎం యోగీ ఆదిత్యానాథ్. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి.. రాష్ట్రంలో ఉన్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ ఏరివేతపై ప్రత్యేక దృష్టిని సారించారు. సామాన్యుడు పోలీస్ స్టేషన్లో అడుగుపెట్టేలా చేశారు. అరాచకాలు సృష్టించిన ఏ క్రిమినల్ అయినా సరే.. యూపీ పోలీసుల చేతికి చిక్కితే అంతే సంగతులు. ఇటీవల మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్ వికాస్ దుబే ఎన్కౌంటర్ దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అనంతరం కూడా మరో రెండు మూడు ఎన్కౌంటర్లు జరిగాయి. అయితే తాజాగా సోమవారం నాడు మరో ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. ఈ సారి షూటర్ హతమయ్యాడు. లక్నో నగరంలోని విభూటీఖండ్ గోమతినగర్ వద్ద షూటర్ గిరిధారి పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో వెంటనే పోలీసులు అతడిపై కాల్పులు జరిపారు. ఈ క్రమంలో షూటర్ గిరిధారి స్పాట్లోనే హతమయ్యాడు. జనవరి 6వ తేదీన అజిత్ సింగ్ అనే నేరగాడిని కాల్చి చంపాడు. ఈ కేసులో ప్రధాన షూటర్ అయిన గిరిధారి పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే పోలీసుల కస్టడీ నుంచి సోమవారం తప్పించుకునేందుకు ప్రయత్నిస్తుండగా.. పోలీసులు ఎన్కౌంటర్ చేశారు.