యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో యోగీ ఆదిత్యనాథ్ మథుర నుంచి పోటీకి నిలపాలని ఆ పార్టీ ఎంపీ హరనాథ్ సింగ్ యాదవ్ పార్టీ చీఫ్ జేపీ నడ్డాను కోరారు. శ్రీకృష్ణ జన్మభూమి నుంచి ఆయన్ని అభ్యర్థిగా ప్రకటించాలనే తన డిమాండ్ వెనక కృష్ణుని ఆదేశం ఉందని నడ్డాకు రాసిన లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న యోగీ…ఈసారి మాత్రం ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. అయితే ఎక్కడినుంచి పోటీ అన్నది పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని అన్నారు.
అయోధ్యనుంచా, మధుర నుంచా లేక గోరఖ్ పూర్ నుంచా అని మీడియా అడిగిన ప్రశ్నకు పార్టీ ఎక్కడికి పంపిస్తే అటు వెళ్తానని బదులిచ్చారు. ఇటీవల ఫరూఖాభాద్ లో జరిగిన ర్యాలీ సందర్భంగా మధుర గురించి మాట్లాడారు యోగీ… అయోధ్యలో మందిర నిర్మాణ జరుగుతోంది. కాశీ విశ్వనాథ్ కారిడార్ పూర్తైంది. మరి మథుర బృందావనాన్ని ఎలా వదిలేస్తాం అని వ్యాఖ్యానించారు.
మథుర లోని షాహీ ఈద్గా మసీదులోని కృష్ణజన్మస్థానంలో శ్రీకృష్ణుడి విగ్రహాన్ని ప్రతిష్టామని డిసెంబర్లో అఖిలభారత హిందూ మహాసభ ప్రకటించింది. దీంతో అక్కడ ప్రభుత్వం భద్రతను కట్టుదిట్టం చేసింది.
आ0 राष्ट्रीय अध्यक्ष श्री @JPNadda ji,
ब्रज क्षेत्र की जनता की हार्दिक इच्छा,
परमादरणीय श्री @myogiadityanath जी भगवान श्रीकृष्ण जी की नगरी मथुरा से लड़ें चुनाव।
कृ0 मेरा अनुरोध पत्र देखें।।
आ0 प्रधानमंत्री श्री @narendramodi जी,
@आ0 @AmitShah जी @BJP4India @blsantosh @BJP4UP pic.twitter.com/ennVZGSviV— हरनाथ सिंह यादव (@harnathsinghmp) January 3, 2022