లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలే లక్ష్యంగా తమిళనాడు రాష్ట్ర బీజేపీ కదులుతోంది. . అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 39 లోక్సభ నియోజకవర్గాల్లో పాదయాత్రకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై సిద్ధమయ్యారు. ఏప్రిల్ 14 తమిళ సంవత్సరాది రోజున తూత్తుకుడి జిల్లా తిరుచెందూర్ నుంచి చెన్నై వరకు 117 రోజులు ఈ పాదయాత్ర చేయాలని నిర్ణయించారు. ఒక్కో నియోజకవర్గంలో మూడ్రోజుల పాటు… రోజుకు 20 నుంచి 28 కి.మీ మేర యాత్రకు రూట్ మ్యాప్ సిద్ధం చేసినట్టు నేతలు తెలిపారు.