అన్నాడీఎంకే పార్టీ శ్రేణులు విషాదంలో మునిగిపోయాయి. పార్టీకి చెందిన సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ ఎ.మహ్మద్జాన్ మంగళవారం గుండెపోటుతో మరణించారు. ఆయన వయస్సు 73 సంవత్సరాలు. రాణిపేట్లో ఎన్నికల ప్రచారంలో కూడా ఆయన పాల్గొన్నారు. అయితే అనంతరం ఆయన విరామం తీసుకుని.. భోజనం చేసేందుకు ఇంటికి వెళ్లారు. ఈ సమయంలోనే ఆయనకు గుండెపోటు రావడంతో వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. వైద్యులు వెంటనే స్పందించి కార్డియో పల్మోనరి చికిత్స చేసినప్పటికీ..ఫలితం దక్కలేదు. కాగా, మహ్మద్ జాన్ మృతి పట్ల తమిళనాడు గవర్నర్ సంతాపం ప్రకటించారు.
Tamil Nadu Governor Banwarilal Purohit condoles the demise of AIADMK MP, A. Mohammed John (file photo).
"The sad demise of A. Mohammed John, Member of
Rajya Sabha, an Industrialist and politician fills me with huge shock and grief," reads a statement. pic.twitter.com/ktjEQAiRtZ— ANI (@ANI) March 24, 2021