తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై కలకలం రేపుతున్నారు. స్వయంగా తనను తాను కొరడాతో దండించుకొన్న వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తమిళనాడు లోని డీఎంకే ప్రభుత్వం దుర్మార్గమైన పాలన అందిస్తోందని లోకానికి తెలియచేసేందుకు ఈ మార్గాన్ని ఆయన ఎంచుకొన్నారు. ఈ ప్రక్రియ ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది.
దీని వెనుక బలమైన కారణం కనిపిస్తోంది. చెన్నైలోని అన్నా యూనివర్సిటీలో జరిగిన అత్యాచార ఘటనపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన ఈయన రాష్ట్రంలోని చెడు అంతా మాయమైపోవాలని ఈ దీక్ష తీసుకున్నారు. అన్నా యూనివర్సిటీలో మూడ్రోజుల క్రితం జరిగిన అత్యాచార ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. రాజకీయ ప్రముఖులు ఈ ఘటనపై స్పందిస్తూ డీఎంకే ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర సర్కారు వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయంటూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా బాధితురాలి పేరు బయటకు రావడానికి కారణం ముఖ్యమంత్రి స్టాలిన్యే అంటూ అంటూ ఆరోపించారు.
Tamil Nadu BJP president K Annamalai self-whips himself as a mark of protest to demand justice in the Anna University alleged sexual assault case.#tamilnadu #Annamalai #DMK #BJP pic.twitter.com/gSEqXdIqdQ
— MyIndMedia (@MyIndMedia) December 27, 2024
ఇక, డీఎంకే ప్రభుత్వం మీద అన్నామలై తీవ్రంగా విరచుకు పడుతున్నారు. డీఎంకే ప్రభుత్వాన్ని గద్దె దించేవరకు తాను పాదరక్షలు ధరించబోనని ప్రతిజ్ఞ చేశారు. అది మాత్రమే కాకుండా వచ్చే ఎన్నికల్లో తాము ఒక్క రూపాయి కూడా ఓటర్లకు పంచకుండా ఎన్నికల్లో పోటీ చేస్తామని, తాను గెలిచే వరకు చెప్పులు వేసుకోనంటూ అన్నామలై వివరించారు. అలాగే రాష్ట్రంలోని చెడు అంతమైపోవాలని కోరుకుంటా ఆ మురుగన్ను దర్శించుకుంటానని చెప్పుకొచ్చారు. గుడికి వెళ్లడం కంటే ముందుగా తన ఇంట్లో 6 కొరడా దెబ్బలు కూడా తింటానని చెప్పారు.
ఈ విషయం తెలుసుకున్న బీజేపీ నేతలు, ఆయన మద్దతుదారులు కోయంబత్తూరులోని అన్నామలై ఇంటికి చేరుకున్నారు. డీఎంకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు చేత పట్టుకుని ఉదయం నుంచి గేటు బయట నిల్చున్నారు. అన్నామలై కూడా చెప్పిన చెప్పిన విధంగానే ఈరోజు తన మొక్కు చెల్లించుకున్నారు. ఉదయమే స్నానం చేసిన ఆయన లుంగీ మాత్రమే కట్టుకుని కొరడాతో తనను తాను కొట్టుకున్నారు. గట్టిగట్టిగా మొత్తం ఆరు దెబ్బలు కొట్టుకుని, ఆపై మురుగున్ స్వామిని దర్శించుకున్నారు.
మొత్తానికి అన్నామలై చేపట్టిన దీక్ష ఇప్పుడు కలకలం రేపుతోంది. తమిళనాడులోని బీజేపీ శ్రేణులు దీని మీద నిరసన ప్రదర్శనలు చేస్తున్నాయి.