భారత అథ్లెట్ అంజూ బాబీకి అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో పతకం (లాంగ్‌జంప్, 2003) నెగ్గిన ఏకైక భారత అథ్లెట్ అయిన అంజూను ప్రపంచ అథ్లెటిక్స్ అసోసియేషన్ ‘వుమన్ ఆఫ్ ది ఇయర్’ గా ప్రకటించింది. వర్చువల్ విధానంలో జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో 44 ఏండ్ల అంజూకు ఈ పురస్కారం లభించింది. ప్రపంచ అథ్లెటిక్స్ సంఘం నుంచి భారత అథ్లెట్‌కు వార్షిక అవార్డు దక్కడం ఇదే తొలిసారి కావడం విశేషం. 2016లో అకాడమీ స్థాపించి బాలికలకు శిక్షణ ఇస్తున్నది. ఆమె వద్ద శిక్షణ పొందినవారిలో ప్రపంచ అండర్-20 స్థాయి పతకాలు సాధించిన వారు ఉన్నారు’ అని వరల్డ్ అథ్లెటిక్స్ సంఘం ఒక ప్రకటనలో పేర్కొంది.
ఈ అవార్డు తన కృషికి దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నానని అంజూ తెలిపింది. ‘ప్రపంచ అథ్లెటిక్స్ సంఘం నుంచి ‘వుమన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు దక్కడాన్ని గౌరవంగా భావిస్తున్నా. ఇది చాలా సంతోషకర సమయం. ఆట నాకు ఎంతో ఇచ్చింది. దానికి తిరిగి ఇవ్వడం కంటే గొప్ప అనుభూతి మరొకటి ఉండదు. నా కృషిని గుర్తించినందుకు ధన్యవాదాలు’ అని అంజూ ట్వీట్ చేసింది.
ఇటీవలే జరిగిన వరల్డ్ అండర్-20 అథ్లెటిక్స్‌లో రజతం సాధించిన షైలీ సింగ్.. అంజూ శిష్యురాలే. వరల్డ్ అథ్లెట్స్ ఆఫ్ ది ఇయర్‌గా ఒలింపిక్ చాంపియన్లు ఎలైన్ థామ్సన్ హెరా (జమైకా), కర్సెటెన్ వార్హౌమ్ (నార్వే) ఎంపికయ్యారు. గతంలో ఈ అవార్డులను వరల్డ్ అథ్లెటిక్స్ గాలా అవార్డులుగా పిలిచేవారు.
Truly humbled and honoured to be awarded Woman of the Year by @WorldAthletics
There is no better feeling than to wake up everyday and give back to the sport, allowing it to enable and empower young girls!
Thank you for recognising my efforts. 😊😊 pic.twitter.com/yeZ5fgAUpa
— Anju Bobby George (@anjubobbygeorg1) December 1, 2021