ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని కాంగ్రెస్ పెద్దలు గొప్పలు చెప్పుకొంటున్నారు కానీ, అనేక వర్గాల ప్రజలు పస్తులతో కాలం గడపాల్సి వస్తోంది. ప్రజల సేవ కోసం గత ప్రభుత్వాలు హడావుడిగా ఏర్పాటు చేసిన వ్యవస్థల్లో అవస్థలు తప్పటం లేదు. తెలంగాణ లో సంచార పశు అంబులెన్స్ సిబ్బంది పరిస్థితి అలానే ఉంది. ఏర్పాటు చేసిన గులాబీ ప్రభుత్వం ఇంటికి వెళ్లిపోయింది. ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ పెద్దలకు ఈ కష్టాలు పట్టడం లేదు.
తెలంగాణ రాష్ట్రము లొ మూగజీవలకు వైద్యం అందించడానికి నియోజకవర్గానికి ఒకటి చొప్పున ప్రతిష్టాత్మకంగా గత ప్రభుత్వం రాష్ట్ర వాప్తంగా సంచార పశు ఆరోగ్య అంబులెన్సు లను ప్రవేశపెట్టింది.గ్రామీణ ప్రాంతాలలో పాడి పరిశ్రమ అభివృద్ధి, గొర్రెల పెంపకం, మేకల పెంపకం రైతులకు భరోసానిచ్చే పథకంగా దీనిని రూపొందించారు. ప్రతీ వాహనంలోనూ వెటర్నరీ డాక్టరు, పారావేటు,డ్రైవరు, ఒక అటెండర్ ఉంటారు. ఈ వాహనాలు గ్రామాల్లో తిరుగుతూ మూగ జీవాలకు వైద్య సేవలు అందిస్తూ ఉంటాయి.
అప్పట్లో ఈ టీమ్ లకు ప్రోత్సాహం ఉండేది. కొంచెం లేట్ అయినా కానీ, వేతనాలు అందుతూ ఉండేవి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో జీతాలు రావటం బాగా లేటు అయిపోతోంది. ప్రస్తుతం నాలుగు నెలలుగా జీతాలు అందటం లేదు. దీంతో పూట గడిచే వీలు లేక ఇబ్బంది పడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగానికి ఈ సంచార అంబులెన్స్ లు ఎంతగానో సేవలు అందిస్తున్నాయి. మూగ జీవాలకు వైద్య సహాయం చేసే సిబ్బంది మూగ వేదనను ప్రభుత్వాలు పట్టించుకోవాలి.