ఆంధ్రప్రదేశ్ లో బలవంతపు మత మార్పిడుల బండారం బట్టబయలు అయింది. మత మార్పిడి కోసం కోట్ల రూపాయలు కుమ్మరిస్తున్న రాకెట్ ను పోలీసులు ఛేదించారు. ఇందుకు సంబంధించి గోదావరి జిల్లా లోని బలభద్ర పురం లో డేవిడ్ అనే పాస్టర్ ను అరెస్టు చేశారు.
అదే గ్రామానికి చెందిన
నక్కా శ్రీనివాస్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో బండారం బట్టబయలు అయింది.. క్రైస్తవ మతంలోకి మారడానికి తను ఒప్పుకోలేదని, ఆ కారణంతో తనను డేవిడ్ తీవ్రంగా వేధించాడనీ నక్కా శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేసాడు., పాస్టర్ డేవిడ్ తనను చర్చి ఫండ్ కోసం లక్ష రూపాయలు అడిగాడని, అది ఇవ్వనందుకు తనను బెదిరించాడనీ నక్కా శ్రీనివాస్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. బిక్కవోలులో శ్రీనివాస్ ఇంటి ఎదురుగా ఉన్న భవనంలో పాస్టర్ డేవిడ్ చర్చి నడుపుతున్నాడు. అక్కడ లౌడ్స్పీకర్లు పెట్టి పెద్ద సౌండ్తో క్రైస్తవ ప్రార్థనలు, గీతాలు ప్రసారం చేయడం ద్వారా వేధించేవాడని, ఆ ధ్వనికి తమ కుటుంబం మొత్తం చాలా అసౌకర్యానికి, ఒత్తిడికీ లోనయ్యేదని శ్రీనివాస్ ఫిర్యాదులో పేర్కొన్నాడు.
ఈ ఫిర్యాదు లో అనేక విషయాలు బయట పెట్టారు.
పాస్టర్ డేవిడ్ తనను పదేపదే క్రైస్తవంలోకి మతం మారాలంటూ ఒత్తిడి చేసేవాడని శ్రీనివాస్ చెప్పాడు. తను ఎన్నిసార్లు నిరాకరించినా వదలకుండా, తనపై ఒత్తిడి చేసేవాడని వివరించాడు. మతం మారనందుకు తనమీద కక్ష కట్టిన పాస్టర్ డేవిడ్ తనగురించి తప్పుడు ప్రచారం చేస్తున్నాడని ఆవేదన చెందాడు. గంజాయి వ్యాపారం, లైంగిక వేధింపుల వంటి అక్రమ కార్యకలాపాల్లో తను పాల్గొంటున్నట్లు తప్పుడు కేసులు పెడతానంటూ బెదిరించేవాడని శ్రీనివాస్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. చర్చిలో కూటములు జరిగినప్పుడు వచ్చే వాహనాలన్నీ తన స్థలంలోనే తన ఇంటికి అడ్డంగా పెట్టి, తమను కదలనివ్వకుండా నిర్బంధించేవారని ఆరోపించాడు. పాస్టర్ డేవిడ్ చర్యల వల్ల తన కుటుంబంలో కలతలు చెలరేగాయనీ, తన భార్య తననుంచి విడిపోయిందనీ శ్రీనివాస్ వాపోయాడు. పోలీసులు భారతీయ న్యాయ సురక్షా సంహిత సెక్షన్ల కింద పాస్టర్ డేవిడ్ మీద కేసు నమోదు చేసారు.
ఆంధ్రప్రదేశ్లో బలవంతపు మతమార్పిడులపై చట్టపరమైన చర్య తీసుకున్న మొదటి కేసు ఇదే. అనధికారికంగా మతమార్పిడులు చేయడం, మతాల మధ్య ఉద్రిక్తతలు రెచ్చగొట్టడం వంటి ఆరోపణలపై విచారణ జరుపుతున్నారు. పాస్టర్ రాజారెడ్డి కార్యకలాపాలు, వాటివల్ల స్థానికంగా ప్రజల మీద పడుతున్న ప్రభావం వంటి విషయాలపై దర్యాప్తు జరుగుతోంది. ఇటువంటి బలవంతపు మత మార్పిడి ల మీద దృష్టి పెట్ఝాల్సిన అవసరం ఉంది.