ఆసక్తికరమైన, సందేశాత్మకమైన అంశాలను ట్విట్టర్ వేదిగ్గా పంచుకుంటుంటారు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా. తాజాగా ఓ ట్వీట్ ఆకట్టుకుంటోంది. ఓ మొబైల్ మారేజ్ హాల్ వీడియోను షేర్ చేస్తూ ఆ ట్వీట్ చేశారాయన. ఎంతో క్రియేటివ్ గా ఉన్న దాన్ని డిజైన్ చేసిన వ్యక్తిని కలవాలని ఉందని ట్విట్టర్లో పేర్కొన్నారు మహీంద్రా.
40 అడుగుల పొడవైన షిప్పింగ్ కంటైనర్ అది. అయితే ఎక్కడిక్కడ, ఎప్పుడంటే అప్పుడు దాన్ని ఫోల్డ్ చేయవచ్చు… విస్తరించవచ్చు. తెరుచుకున్నప్పుడు మరో 30 అడుగులు పెరుగుతుందది. 1200 చదరపు అడుగుల మేర ఉన్న దాన్ని కల్యాణవేదికగా తీర్చిదిద్దారు. పట్టణాలు, నగరాల్లో సిద్ధంగా ఉన్న ఆధునిక ఫంక్షన్ హాళ్లకు ఏమాత్రం తీసిపోని రీతిలో ఆ మొబైల్ కంటైనర్ ఉంది. ఆకట్టుకునే ఇంటీరియర్ డిజైనింగ్ తో అద్భుతంగా ఉందది. 200 మంది అందులో కూర్చుని కల్యాణవేడుకను చూడవచ్చు. ఏసీలున్నాయి. అక్కడే భోజనం చేసే ఏర్పాట్లుకూడా ఉన్నాయి. వివాహాలే కాక..చిన్న చిన్న వేడుకల్ని వాటిలో చేసుకోవచ్చు. పర్యావరణ అనుకూలంగా దాన్ని సిద్ధం చేయడం ఆనంద్ మహీంద్రాను అమితంగా ఆకట్టుకుంది. అందుకే ఆ వీడియోను షేర్ చేస్తూ..దాన్ని తయారు చేసిన వ్యక్తిని కలవాలనుకుంటున్నట్టు ట్వీట్ చేశారు.
https://twitter.com/anandmahindra/status/1573899771277737986?s=20&t=xh4vaGqyEWH_Hz4Yn7G9Pg