ఎవరికే ఆపదా వచ్చినా ఆదుకోవడంలో ముందుంటారు ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా. అంతబిజీ లైఫ్ లోనూ సోషల్మీడియాలో ఆక్టివ్ గా ఉంటూ…తనదైన శైలిలో మంచి సందేశాలిస్తుంటారు. ఆకట్టుకునే అంశాల్ని షేర్ చేస్తుంటారు. ఇక ఓ పిల్లి, రెండు కాకులకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వీడియోనూ ఇన్ స్టాలో షేర్ చేశారాయన. అదిప్పుడు తెగవైరల్ అవుతోంది. ఈవీడియోకు ఆయన జతచేసిన మెసేజ్ ఎంతో స్ఫూర్తివంతంగా ఉంది. టీంవర్క్ బహుచక్కటి ఫలితం ఇస్తుందన్నది ఆ సందేశం సారాంశం. Anand Mahindra Monday Motivation హాష్ ట్యాగ్ తో దాన్ని పోస్ట్ చేశారు.
ఇక వివరాల్లోకి వెళ్తే…ఓ పిల్లి రోడ్డుమీద పడిన ఆహారాన్ని తింటోంది. అప్పుడే ఆ ఆహారం కోసం రెండు కాకులు వచ్చాయి. అయితే పిల్లి కాకులను దగ్గరకు రానీయడం లేదు. అప్పుడు రెండు కాకులు ఓ పథకం వేశాయి అప్పటికప్పుడే. ఓ
కాకి అరుస్తూ.. పిల్లిని వెనకనుంచి పొడిచింది. దాంతో పిల్లి ఆగ్రహంతో తింటున్న ఆహారాన్ని వదిలి దాని వెంబపడింది. అంతలోనే రెండోకాకి వచ్చి ఆ ఆహారాన్నిఅందుకుపోయింది. కాకుల తెలివిగా పిల్లినుంచి ఆహారాన్ని ఎలా సంపాదించాయో ఈ వీడియో చెబుతోంది. దాన్ని ఆనంద్ మహీంద్రా పోస్ట్ చేస్తూ టీంగా కలిసి పనిచేస్తే ఎప్పుడూ రిజల్ట్ బాగుంటుందని కామెంట్ చేశారు.