ఆంధ్రప్రదేశ్లో విజయసాయిరెడ్డి రిటైర్మెంట్ హాట్ టాపిక్ గా మారింది. రాజకీయ పండితులు కొంత కాలంగా ఈ నిర్ణయాన్ని ఊహిస్తున్నారు. రాజీనామా చేస్తారు అనుకున్నారు కానీ రిటైర్మెంట్ అనేది విడ్డూరంగా మారింది. అవునన్నా కాదన్నా కేసులు కారణం తోటే ఆయన పక్కకు తప్పుకున్నారు. కానీ ఇది భయమా, వ్యూహమా అన్నది సస్పెన్స్ గా ఉంది.
ఆడిటర్ గా ఎంతో సక్సెస్ అయిన విజయసాయిరెడ్డి రాజకీయంగా ఎత్తుపల్లాలు చవిచూశారు. ప్రత్యర్థి పార్టీల నాయకులను గతంలో సాయి రెడ్డి భయంకరంగా తిట్టిపోసేవారు. బూతులు తప్ప అన్నీ వాడేసేవారు. అటు ప్రభుత్వ యంత్రాంగంలో అధికారులను బాగా సతాయించారు అన్న పేరు కూడా ఉంది. విశాఖపట్నం కేంద్రంగా అనేక ప్రైవేటు పంచాయతీలు ఆయన నడిపించారు అని తెలుస్తోంది. ఈ క్రమంలో సొంత పార్టీలో కూడా ఆయనకు విమర్శలు పెరిగాయి. దీంతో గత ఐదేళ్లుగా మిత్రుల కన్నా శత్రువులను విపరీతంగా పోగేసుకున్నారు.
ఇప్పటికే విశాఖ కేంద్రంగా కేసులు పెట్టేందుకు రంగం సిద్ధం అయినట్లు తెలుస్తుంది.
కేసుల నుంచి బయట పడేందుకు… అందరినీ పొగిడేసి రాజీనామా సమర్పించారు. . ఏ రాజకీయపార్టీ లోను చేరడంలేదని రాజీనామా ప్రకటనలో తెలిపారు. ఈ రేంజిలో శత్రువు లు పెంచుకొన్నాక .. ఏ పార్టీ ఆయన్ని గుమ్మం ఎక్కనీయదు.
అదే సమయంలో ఎప్పటికీ వైయస్ కుటుంబానికి వీర విధేయుడుని అని ఆయన అంటున్నారు. రాజీనామా పత్రంలో కూడా వైయస్ జగన్ కు భారతమ్మకు ధన్యవాదాలు తెలియజేశారు. కానీ విజయమ్మ పేరు కానీ విజయమ్మ పేరు కానీ, షర్మిల పేరు కానీ ప్రస్తావన చేయలేదు.
ఇక్కడే మరో టెస్ట్ కూడా ఉంది. అకస్మాత్తుగా తెలుగుదేశం జనసేన పార్టీలకు జేజేలు పలికారు. చంద్రబాబు కుటుంబంతో వ్యక్తి గతంగా విభేదాలు లేవని,, పవన్ కళ్యాణ్ తో చిరకాల స్నేహం ఉందని స్పష్టం చేశారు. పనిలో పనిగా బిజెపి అగ్రనేతలు నరేంద్ర మోడీ, అమిత్ షాలను కూడా పొగిడేశారు.
ఒకవైపు సొంత పార్టీ అగ్రనేతల్ని మొక్కుబడిగా ధన్యవాదాలు చెప్పడం ప్రత్యర్థి పార్టీలకు జేజేలు పలకడం వ్యూహాత్మకం అని అంటున్నారు. విశాఖలో విజయ సాయి చేసిన కొన్ని పంచాయతీలని వీడియోలు తీసారని అవి బయటకు రాకుండా ఉండేందుకు ఆయన ప్రయత్నాలు చేసుకుంటున్నారని తెలుస్తోంది . అందుచేత నే.. భవిష్యత్తులో ఇబ్బంది రాకుండా ఉండేందుకు ఈ మార్గాన్ని ఎంచుకున్నారు అని తెలుస్తోంది.