మణిపూర్‌లోని చురాచంద్ పూర్ జిల్లాలో ఉగ్రవాదుల మెరుపుదాడికి కమాండింగ్ ఆఫీసర్, ఆయన భార్య, ఆరేళ్ల కుమారుడు సహా 46 అస్సాం రైఫిల్స్‌కు చెందిన నలుగురు సైనికులు బలయ్యారు. చైనా ఆదేశాల మేరకే ఈ దాడి జరిగిందని పలువురు ఆరోపిస్తున్నారు. దాడి తమ పనేనని పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ మణిపూర్, మణిపూర్ నాగా పీపుల్స్ ఫ్రంట్ ప్రకటించింది. చైనాతో బలమైన సంబంధాలు కలిగిఉన్న సంస్థలివి. గతంలో బీజింగ్ నుంచి అనేక రకాల ప్రోత్సాహం, సహకారం వీరికి అందింది.
ఈశాన్య ప్రాంతంలోని తిరుగుబాటు గ్రూపులకు చైనా చాలా కాలం నుంచి ఆయుధాలు అందిస్తోంది. గెరిల్లా వ్యూహాలు నేర్పిస్తోంది. అన్నివిధాలా మెరుగైన శిక్షణను అందిస్తోంది. ఆయా సంస్థల నాయకులు చాలా మంది పలుమార్లు చైనా వెళ్లారు. అక్కడి నాయకులతో సన్నిహిత చర్చలూ, సంభాషణలూ జరిపారు.
మణిపూర్‌లో తమ ఉనికి చాటుకునేందుకే ఉగ్ర గ్రూపులు ఇప్పుడీ కాల్పులకు తెగబడినట్టు తెలుస్తోంది.
మణిపూర్‌లోని PLA , ఇతర లోయ ఆధారిత తిరుగుబాటు గ్రూపులు చైనాతో సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తున్నాయని, నాగాలాండ్‌లోని దిమాపూర్ సమీపంలోని రంగపహార్లోని ఆర్మీ 3 కార్ప్స్ హెడ్‌క్వార్టర్స్‌కు అనుబంధంగా ఉన్న బ్రిగేడియర్, ఈ సంస్థల నాయకులు చైనాతో క్రమం తప్పకుండా కమ్యూనికేషన్లో ఉన్నారని ఆర్మీ అధికారులు అంటున్నారు. హత్యకు గురైన కల్నల్ విప్లవ్ త్రిపాఠీ నేతృత్వంలోని 46 అస్సాం రైఫిల్స్ బెటాలియన్ నిర్వహించిన తిరుగుబాటుదారులకు చుక్కలు చూపించాయి.
ఇండో-మయన్మార్ సరిహద్దులో డ్రగ్స్ స్మగ్లింగ్‌ను కట్టడి చేస్తూ 46అసోం రైఫిల్స్ బెటాలియన్ కీలక నిర్ణయాలు తీసుకంది. మాదకద్రవ్యాలే వారి ప్రధాన ఆదాయవనరు. వీటినికల్నల్ త్రిపాఠీ కట్టడి చేసినందుకే ఉగ్రసంస్థలు ఈ ఘాతుకానికి తెగబడ్డారు. మణిపూర్-మయన్మార్ సరిహద్దు 398 కిలోమీటర్లు ఉంటుంది. చాలావరకు కంచె ఉండదు. బెహియాంగ్ సరిహద్దు ప్రాంతంలో అసోం రైఫిల్స్ ఔట్ పోస్ట్ నుంచి ఆకస్మిక దాడి జరిగిన ఖుగాలోని 46 అసోం రైఫిల్స్ బెటాలియన్ ప్రధాన కార్యాలయాన్ని కలిపే సింగిల్ లేన్ రహదారి గుండానే మాదకద్రవ్యాల రవాణా సాగుతుంది.
ఉగ్రవాదులు కాల్పులు జరిపిన తర్వాత కాన్వాయ్‌పై మొదట ఐఈడీ పేలుడు జరిగింది. డిప్యుటేషన్‌పై 46 అస్సాం రైఫిల్స్ యూనిట్ కమాండింగ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న కల్నల్ విప్లవ్ త్రిపాఠి మయన్మార్ సరిహద్దులోని తన కమాండ్ పోస్ట్‌లలో ఒకదాని నుండి తిరిగి వస్తుండగా దాడి జరిగింది. ఉగ్రదాడిలో మరణించిన నలుగురు జవాన్లు క్విక్ రెస్పాన్స్ టీమ్‌కు చెందినవారు.కల్నల్ త్రిపాఠి తన భార్యాకొడుకుతో వెళ్తుండగా దాడికి తెగబడ్డారు. అందుకు ప్రతీకారం తీర్చుకుంటామని అసోం రైఫిల్స్ అధికారి తెలిపారు.
అస్సాం రైఫిల్స్ కాన్వాయ్‌పై జరిగిన ఆకస్మిక దాడి, పొరుగున ఉన్న చందేల్ జిల్లాలోని డోగ్రా రెజిమెంట్‌పై 2015 ఆకస్మిక దాడిని తలపిస్తోంది.నాటి ఘటనలో 18మంది బలయ్యారు. మయన్మార్‌లోని షాన్, రఖైన్ ,కచిన్ ప్రాంతాలలో తిరుగుబాటుదారులకు చైనా మద్దతు ఇస్తోందని…చైనా ఆయుధ కర్మాగారాల్లో తయారైన AK-సిరీస్ రైఫిల్స్, గ్రెనేడ్లు ,ఇతర మందుగుండుసామగ్రిని తిరుగుబాటు గ్రూపులకు సరఫరా చేస్తున్నట్లు ఆర్మీ ఉన్నతాధికారులు అంటున్నారు.