వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కమల దళం దూసుకెళ్తోంది. ఈ సారి ఎలాగైనా అధికారంలోకి రావాలన్న కృతనిశ్చయంతో ఉంది. బీజేపీకి చెందిన అగ్రనేతలంతా రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఓ వైపు ప్రధాని మోదీ.. మరోవైపు యూపీ సీఎం యోగీ.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలు విస్తృత ప్రచారం చేపడుతున్నారు. ఈ క్రమంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా.. బుధవారం నాడు హౌరాలో పర్యటించారు.
దోమ్జూర్ నియోజకవర్గంలో ప్రచారం చేపట్టిన షా.. బీజేపీ అభ్యర్ధి రజీజ్ బెనర్జీకి ఓటేసి గెలిపించాలని ప్రజలను కోరారు. స్థానికంగా ఉన్న ఓ గ్రామ పంచాయితీలో పర్యటించానని.. అక్కడి ప్రజల ఉత్సాహం చూస్తుంటే.. రజీజ్ బెనర్జీ గెలుపు ఖాయమని స్పష్టమవుతోందని అన్నారు. మే 2వ తేదీన బెంగాల్లో టీఎంసీ కనుమరుగవ్వడం ఖాయమని.. బీజేపీ 200 సీట్లు గెలువబోతుందని ధీమా వ్యక్తం చేశారు. కాగా, ప్రచారానికి ముందు ఆయన స్థానికంగా ఉన్న ఓ రిక్షావాల ఇంట్లో భోజనం చేశారు. అమిత్ షాతో పాటుగా బీజేపీ అభ్యర్ధి రజీజ్ బెనర్జీ కూడా భోజనం చేశారు.
Domjur: Union Home Minister and BJP leader Amit Shah has lunch at the residence of a rickshaw puller who is also a BJP supporter. Rajib Banerjee, party's candidate from the constituency also present. #WestBengal pic.twitter.com/het96CYWnz
— ANI (@ANI) April 7, 2021