ఎన్నికల సంస్కరణలపై లోక్సభ దద్దరిల్లిపోయింది. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా బలంగా తిప్పికొట్టారు. ప్రతీ ఆర్గుమెంట్ కు కచ్చితమైన, స్పష్టమైన సమాధానాలు ఇచ్చారు. దీంతో పార్లమెంటు అంతా కదిలిపోయింది.
…………
రాహుల్ ఆరోపణలు, అమిత్ షా సమాధానాలను ఒక్కొక్కటిగా చూద్దామ్.
…………..
1) రాహుల్ గాంధీ ఆరోపణ:
ఓటర్ల జాబితాలలో పెద్ద ఎత్తున అవకతవకలు జరుగుతున్నాయి. అర్హులు కాని వ్యక్తుల పేర్లు చేరుతున్నాయి. దీనిపై ప్రత్యేక చర్చ కావాలి.
1) అమిత్ షా సమాధానం:
ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను పూర్తిగా ఎన్నికల సంఘమే నిర్వహిస్తుందనీ, కేంద్ర ప్రభుత్వానికి ఇందులో పాత్ర లేదని స్పష్టం చేశారు.
1952లో నెహ్రూ హయాంలోనూ, మన్మోహన్ సింగ్ కాలంలోనూ ఇదే విధానం అమల్లో ఉందని చెప్పారు. అప్పుడు
“అప్పుడు సరైనదైతే ఇప్పుడు ఎందుకు సమస్యగా చూస్తున్నారు?” అని ప్రశ్నించారు.
2) రాహుల్ గాంధీ ఆరోపణ:
ఎన్నికల కమిషనర్ల నియామకంపై కేంద్రం పూర్తి నియంత్రణ సాధించింది. ఎన్నికల సంఘం స్వతంత్రత దెబ్బతింటోంది.
2) అమిత్ షా సమాధానం:
నియామకాలు పారదర్శకంగానే జరుగుతున్నాయని, ఎన్నికల సంఘం స్వతంత్రతకు ఎటువంటి భంగం కలగలేదని చెప్పారు.
గత ప్రభుత్వాల మాదిరిగానే నియామకాలు, నిర్వాహణ జరుగుతున్నాయి.
3) రాహుల్ గాంధీ ఆరోపణ:
SIR ప్రక్రియ వర్గాలపై, ముఖ్యంగా మైనారిటీలపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. వివక్ష జరుగుతోంది.
3) అమిత్ షా సమాధానం:
SIR లక్ష్యం ఎవరి మీదా వివక్ష కాదని, ఓటర్ల జాబితాలోని లోపాలను తొలగించడం మాత్రమే ప్రధాన ఉద్దేశం.
చనిపోయిన వారి పేర్లు, డుప్లికేట్ ఓట్లు, అక్రమ వలసదారుల వివరాలు క్లియర్ చేయటం మాత్రమే లక్ష్యం.
4) రాహుల్ గాంధీ ఆరోపణ:
ప్రభుత్వం భయంతో SIR వివరాలను దాచిపెడుతోంది. పారదర్శకత లేదు.
4) అమిత్ షా సమాధానం:
“భయపడేది మేమేం కాదు… ఆధారాలు లేకపోవడమే ప్రతిపక్షాల అసలు సమస్య”
గత నాలుగు నెలలుగా ప్రతిపక్షాలు SIRపై అవాస్తవాలను ప్రచారం చేస్తున్నాయి.
5) రాహుల్ గాంధీ ఆరోపణ:
హోంమంత్రి చర్చకు దూరంగా ఉన్నారు. నా ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం లేదు. ప్రభుత్వం స్పష్టత ఇవ్వడంలేదు.
5) అమిత్ షా సమాధానం:
“సభలో నేను ఏమి మాట్లాడాలో నాకు ఎవరు చెప్పాల్సిన పని లేదు”
“వాస్తవాలపై మాట్లాడలేకపోతే ఆరోపణలతో తప్పించుకోవడం ప్రతిపక్షాల పద్ధతి” అని తీవ్రంగా వ్యాఖ్యానించారు.
…………………………………..
మొత్తం మీద పార్లమెంట్ చర్చలో రాహుల్ గాంధీ వరుస ఆరోపణలు చేస్తే, హోంమంత్రి అమిత్ షా ప్రతి అంశానికీ వాస్తవాలు, చరిత్ర, రాజ్యాంగం ఆధారంగా స్పష్టమైన సమాధానాలు ఇచ్చారు. SIRను ప్రతిపక్షాలు వక్రీకరిస్తున్నాయని, ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా కొనసాగేందుకు ఈ చర్యలు అవసరమని హోంమంత్రి స్పష్టం చేశారు. దీంతో రాహుల్ గాంధీ ఆరోపణలు అన్నీ వట్టివే అని స్పష్టంగా తేలిపోయింది.




