ఆఫ్గనిస్తాన్‌లో కొత్తగా ఏర్పాటైన తాలిబన్ల ప్రభుత్వంపై అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. ఐక్యరాజ్య సమితి బ్లాక్ లిస్ట్‌లో ఉన్నవారు పాలకులుగా మారడంపై అసహనం వ్యక్తం చేస్తోంది.అలాగే కొత్త సర్కారులో మహిళలకు అసలు చోటే లేకపోవడమేంటని ప్రశ్నించింది. ఈమేరకు ఓ ప్రకటన విడుదల చేస్తూ….’ఆఫ్గనిస్తాన్ లో కొత్తగా ఏర్పాటైన మంత్రివర్గంలో వారి సన్నిహిత సహచరులే ఉన్నారు. మహిళలే లేరు. వీరిలో కొందరి ట్రాక్ రికార్డపై మేం ఆందోళనచెందుతున్నాం’ అంది.
ఆఫ్గనిస్తాన్‌లో పరిస్థితులు, పరిణామాలను ప్రపంచం మొత్తం గమనిస్తోందని…ఇతర దేశాలను బెదిరించడానికి ఆ దేశాన్ని తాలిబన్లు వాడుకోరనే ఆశిస్తున్నామని తెలిపింది అగ్రదేశం.
తాలిబన్లు ప్రకటించిన ఆఫ్గన్ తాత్కాలిక ప్రభుత్వాధినేత ముల్లా మహమ్మద్ హసన్ అఖుంద్ ఐక్య రాజ్య సమితి బ్లాక్ లిస్ట్‌లో ఉన్నారు. ఇంటీరియర్ మినిస్టర్ సిరాజుద్దీన్ హక్కానీ ఎఫ్‌బీఐ వాంటెడ్ లిస్ట్‌లో ఉన్నారు.