ఆదిలాబాద్ లోని భోథ్ మండలంలో కుచులాపూర్ గ్రామంలో అంబేద్కర్ జయంతి ఉత్సవాలకు తెలంగాణ రాష్ట్ర అధ్యాపక సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జాదవ్ మాట్లాడుతూ “బహుముఖ ప్రజ్ఞాశాలి, భారతరత్న, బడుగు బలహీన వర్గాల ఆశజ్యోతి అంబేద్కర్ గారి 131 జయంతి కుచులాపుర్ గ్రామంలో ఘనంగా జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. అంబేద్కర్ మన రాజ్యాంగాన్ని రచించి స్వరాజ్య భారతదేశ సుపరిపాలన కోసం పాటుపడ్డారు. అంబేద్కర్ గారు కొలంబియా, లండన్ యూనివర్సిటీల నుంచి డాక్టరేట్ పట్టా పొందారు, స్వతంత్ర భారతదేశంలో మొదటిసారిగా ఏర్పడ్డ ప్రభుత్వంలో న్యాయశాఖ మంత్రిగా పని చేసారని.. అందరూ సమానులే అందరికీ సమానత్వం ఉండాలని భారతీయులందరిని ఒకే తాటిపై నిలిపారు. దేశంలో అంటరానితనం ఉండకూడదని అందరూ సమానులే అని పిలుపునిచ్చారు” అని అన్నారు. ఈ కార్యక్రమంలో VDC చైర్మన్ భోజరెడ్డి, ఉపసర్పంచ్ దాసు, మోహన్ రెడ్డి, గోవర్ధన్, శ్యామ్ సుందర్. అలాగే అంబేద్కర్ యువజన సంఘం నాయకులు లక్ష్మణ్, గంగారెడ్డి, బొజ్జ నారాయణ, అఖిల్, రవితేజ, తరుణ్, కృష్ణ, సాయి కిరణ్, శ్రీకాంత్, ఈశ్వర్, నరేష్, సురేష్ సహా తదితరులు పాల్గొన్నారు.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్‌స్క్రైబ్ చేయండి.)