బాలీవుడ్ హిట్ మూవీ బజరంగీ భాయిజాన్ లో నటించిన పాప హర్షాలీ మల్హోత్రా ను మహారాష్ట్ర ప్రభుత్వం “అంబేద్కర్” పురస్కారంతో సత్కరించింది. ఇప్పుడా చిన్నారికి 13 ఏళ్లు. ఆ రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ నుంచి పురస్కారం అందుకున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది హర్షాలీ. సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రగా బజరంగీ భాయ్ జాన్ తెరకెక్కింది. తనకొచ్చిన గౌరవాన్ని సల్మాన్ ఖాన్, ఆ మూవీ డైరెక్టర్ కబీర్ ఖాన్, నిర్మాతలు, ఇతర చిత్రబృందాన్ని అంకితం ఇస్తున్నట్టు చెప్పింది.