శ్రీనగర్‌లోని ఆల్ ఇండియా రేడియో బాల్టాల్ బేస్ క్యాంప్ నుంచి అమర్నాథ్ యాత్ర ప్రత్యేక ప్రసారాన్ని ప్రారంభించింది. అందుకు ప్రత్యేకంగా స్టూడియో ఏర్పాటు చేసింది. ఇక్కడ యాత్రకు సంబంధించి వివరాలతో ప్రతిరోజూ ఉదయం 7 నుంచి రాత్రి 10 గంటల వరకు పదహారు గంటల పాటు ప్రసారం చేయనున్నారు.
AIR కు చెందిన NewsonAir యాప్‌లో యాత్రికుల కోసం అందుబాటులో ఉంటుంది, ఇందులో అమర్నాథ్ యాత్ర ప్రసారం కోసం ప్రత్యేక ప్లాట్‌ఫారమ్ ను రూపొందించారు. ఈ యాప్‌లో ప్రసారం ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉంటుంది. ఇది FM 103.7 Mghzలో అందుబాటులో ఉంటుంది. ఈ రోజువారీ ప్రసారం రక్షా బంధన్ రోజు వరకు అందుబాటులో ఉంటుంది.
యాత్రికులకు తాజా అప్డేట్ ల కోసం జమ్మూ నుంచి బల్తాల్, పహల్గాం మార్గాల్లో అమర్నాథ్ పుణ్యక్షేత్రం వరకు యాత్ర నుంచి క్షేత్ర నివేదికలు ప్రసారం చేస్తున్నారు. ప్రతీ గంటకీ వాతావరణ అప్డేట్లు, అవసరమైన సలహాలు సహా మార్గదర్శకాలు క్రమం తప్పకుండా ప్రసారం చేయనున్నారు.