అమరీందరే అన్నాడు….
అదే రైతు ఉద్యమం వెనకాల ఖాలిస్తాన్ వేర్పాటువాదులు, జిహాదీలు వున్నారు, శత్రు దేశాలు సహాయం చేస్తున్నాయి అని కొందరంటే వాళ్లమీద బీజేపీ ముద్ర , మతతత్వ ముద్ర వేశారు కొందరు…మోదీ భజన పరులకు అందరూ దేశ ద్రోహులు లాగే కనిపిస్తారు, అన్నిటికి పాకిస్థాన్ పేరు చెప్తారు అని వెక్కిరించారు.
మరి పంజాబ్ ముఖ్యమంత్రి ఏమన్నాడో చూశారుకదా..విన్నారు కదా!
వ్యవసాయ చట్టాలపై నిరసనలు ప్రారంభమైన తరువాత పాకిస్థాన్ నుండి ఆయుధాల అక్రమ రవాణా విపరీతంగా పెరిగిందని పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ అన్నారు.
దీంతో నిరసనల వెనుక విదేశీ, ప్రభుత్వ వ్యతిరేక శక్తులు ఉన్నాయని మొదటినుంచి బిజెపి చేస్తున్న ఆరోపణలకు పంజాబ్ ముఖ్యమంత్రి (కాంగ్రెస్) మాటలు బలం చేకూర్చినట్లయింది.
ANI వార్త సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో “నిరసనల వెనుక ఖలిస్తానీ గ్రూపులు ఏమైనా ఉన్నాయా?” అని విలేఖరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా అమరీందర్ మాట్లాడుతూ పాకిస్థాన్ ఏం చెయ్యాలనుకున్నదో అదే చేస్తుంది. దీని వెనుక ఖచ్చితంగా పాకిస్థాన్ ప్రేరేపిత ఖలిస్తాన్ గ్రూపులు ఉన్నయి. అక్టోబర్లో నిరసనలు ప్రారంభమైనప్పటి నుండి పాకిస్థాన్ పంజాబ్ లో ఇబ్బందులను సృష్టించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. దీని గురించి కేంద్ర ప్రభుత్వానికి కూడా సమాచారం ఇచ్చాము. డ్రోన్ల ద్వారా ఆయుధాలను అక్రమంగా రవాణా చేయడానికి, సరిహద్దుల వెంబడి చొరబాట్లను ప్రవేశపెట్టడానికి పాకిస్థాన్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఆయుధాలతో పాటు సరిహద్దు మీదుగా నగదు, హెరాయిన్లను అక్రమంగా రవాణా చేయడానికి డ్రోన్లను ఉపయోగిస్తున్నారు.” అని అమరీందర్ తెలిపారు. “కొన్ని డ్రోన్లను పట్టుకున్నాం. కానీ అప్పటికే కొన్ని లక్ష్యాలకు చేర్చాల్సినవి చేర్చి వెళుతున్నాయి, ఇప్పటికీ పంజాబ్ ని లక్ష్యంగా చేసుకుని పాకిస్థాన్ స్లీపర్ సెల్స్ బలంగా పని చేస్తున్నాయి.” అని అయిన అన్నారు.
“నవంబర్లో మీరు (అమరీందర్ సింగ్) కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసినప్పుడు ఇటువంటి విషయాలు వారితో చెప్పారా?” అని విలేఖరి అడిగినప్పుడు “లేదు, అప్పుడు మేము వెళ్ళింది రైతు నిరసనలపై చర్చిండం కోసమే.” అని బదులిచ్చారు.
విచిత్రమైన విషయం ఏమిటంటే రైతు నిరసనలకు మొదట గట్టిగా మద్దతు ఇచ్చిన తొలి నాయకుడు అమరీందర్ సింగ్. రాహుల్ గాంధీ పంజాబ్ సందర్శించినప్పుడు, అమరీందర్ అతనికి ట్రాక్టర్ ర్యాలీలో తోడుగా ఉంటూ గట్టి మద్దతు ఇచ్చారు కూడా.