ఆల్ట్‌న్యూస్ సహ వ్యవస్థాపకుడు మహమ్మద్ జుబేర్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. త్రిశూల్ దీక్షా సంబరాన్ని ఆయుధ శిక్షణాశిబిరం గా వ్యాఖ్యానించాడు. అది ఉగ్రవాద శిక్షణా శిబిరం అంటూ ట్వీట్ చేసిన అక్బర్ వంటి ఇస్లామిస్టుల ట్వీట్లకు రీట్వీట్ చేశాడు. బజరంగదళ్ నిర్వహించే శిబిరానికి సంబంధించిన ఫొటోలను ఆయన షేర్ చేశాడు. కర్ణాటకలోని కొడగు జిల్లా పొన్నంపేటలోని సాయిశంకర్ విద్యాసంస్థలో ఒక వారం పాటు ఆయుధ శిక్షణా శిబిరం నడించింది. ఆ విషయం చెబుతూ అక్కడ అనేక మంది బజరంగ్ దళ్ కార్యకర్తలకు “ఆయుధాలు” పంపిణీ చేశారని ట్వీట్ చేశాడు.
అసలైతే అది వాస్తవం కాదు. త్రిశూలాన్ని ఆయుధంగా పేర్కొంటూ ఫేక్ న్యూస్ వ్యాప్తి చేస్తున్నారని చాలామంది మండిపడ్డారు. వాస్తవానికి హిందువులకు దైవిక చిహ్నం శూలం. చాలా హిందూ దేవాలయాలలో, ముఖ్యంగా శివుడు, అమ్మవారి దేవాలయాలలో ఎక్కువగా కనిపిస్తుంటుంది.
సిక్కులు వెంట ఉంచుకునే కిర్పాన్‌లను ఆయుధాలుగా పరిగణించనట్లే, ముహర్రం సమయంలో ముస్లింలు ఉపయోగించే కత్తులు, ఇతర వస్తువులను అక్రమ ఆయుధాలుగా పరిగణించనట్లే, అదేవిధంగా త్రిశూలాలు కూడా ఆయుధాలు కావు, అవి హిందూ మత చిహ్నాలు. త్రిశూలంను ఆయుధంగా పేర్కొనడం ద్వారా ఇస్లామిస్ట్ జుబేర్ హిందూమతం పట్ల తనకున్న తీవ్ర ద్వేషాన్ని ప్రదర్శించాడు.
https://twitter.com/zoo_bear/status/1525747586107199489?s=20&t=b2LFVlLKurzCoyW-YygARw
మతపరమైన చిహ్నాలుగా, మతపరమైన ఆచారాల సమయంలో హిందువులు క్రమం తప్పకుండా త్రిశూలంను తీసుకువెళతారు. విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్‌లో త్రిశూల్ దీక్ష అనేది ఒక సాధారణ కార్యక్రమం. సంస్థ సభ్యులు హనుమంతుడు, శక్తి ఆరాధకులు. అందువల్ల వారు తమ చేతుల్లో చిన్న త్రిశూలాలను తీసుకెళ్లి ‘త్రిశూల్ దీక్ష’ పొందడం వారి కార్యకలాపాలలో ఒక భాగం.
విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు. అయితే కోవిడ్-19 మహమ్మారి కారణంగా గత రెండేళ్లలో చాలా చోట్ల ఈ వార్షిక కార్యక్రమాన్ని నిలిపేసాయి. ఇటీవల కర్ణాటకలో అలాంటి ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు, అక్కడ సభ్యులకు త్రిశూల్ దీక్ష ఇచ్చారు. జుబేర్ దానిని ఆయుధ శిక్షణా శిబిరం అనేశారు.
మహ్మద్ జుబేర్ రెండు విభిన్న నేపథ్యాల నుంచి వచ్చిన యువకుల కార్యకలాపాలను పోల్చి రెండు ఫోటోలను కూడా ట్వీట్ చేశాడు. ఒక ఫోటోలో మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ కొడుకు, తన స్నాతకోత్సవ కార్యక్రమంలో ఉన్న ఫోటోను హైలైట్ చేసాడు. అతడు ఈ ఫోటోను హిందూ యువకులు హాజరైన త్రిశూల్ దీక్ష కార్యక్రమానికి సంబంధించిన ఫోటోతో పోల్చాడు. క్యాప్షన్‌లో “వారి పిల్లలు.. మీ పిల్లలు…” అని రాశాడు. ఈ ట్వీట్‌తో నాయకుల కొడుకులు మంచి విద్యను అభ్యసిస్తున్నారని, మరి వీళ్ళేమో వేరే వారి నుంచి బ్రెయిన్‌వాష్ అవుతున్నారని చెప్పే ప్రయత్నం చేశాడు.
గతంలో చాలా మంది బీజేపీ నాయకులు విశ్వహిందూ పరిషత్‌లో క్రియాశీల సభ్యులుగా ఉన్నారని.. వారి పనితీరు కారణంగా వారు ఇప్పుడు ఉన్నత స్థానాలకు చేరుకున్నారనే వాస్తవాన్ని మహమ్మద్ జుబేర్ విస్మరించారు