కాంగ్రెస్ పార్టీ నుంచి తోటి మిత్రపక్షాలు కూడా నెమ్మదిగా పక్కకు జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నౌక అని అర్థం చేసుకొని పక్కకు తప్పుకునే ప్రయత్నం చేస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో మిత్ర పక్షాలు బలపడినప్పటికీ కాంగ్రెస్ పార్టీ పెద్దగా పురోగతి సాధించలేదు. తర్వాత జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అదే పరిస్థితి. దీంతో కాంగ్రెస్ పార్టీ తోటి నడుస్తున్న మిత్రపక్షాలలో,, హస్తం పార్టీ మీద అనుమానాలు మొదలయ్యాయి.
తాజాగా పార్లమెంటు దగ్గర కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఆందోళనకు రెండు పార్టీలకు డుమ్మా కొట్టాయి. ప్రధాన పార్టీలో అయినా సమాజ్ వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా దూరం పాటించాయి. ఆదాని వ్యవహారం సంబల్ అల్లర్ల మీద వెంటనే చర్చ చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నది. ఈ మేరకు ఈ వారం రోజులపాటు ఢిల్లీకి కేంద్రంగా ఎంపీలు చేపట్టాల్సిన ఆందోళనకు ప్రణాళికను రచించుకున్నారు. కానీ సోమవారం నాడు ఇండియా కూటమి సమావేశానికి కూడా ఈ రెండు పార్టీలు హాజరు కాలేదు. పార్లమెంటు కార్యక్రమాలు సజావుగా జరగాలన్నదే తమ అభిప్రాయమని తృణమూల్, సమాజ్ వాది చెప్తున్నాయి.
మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ వైఖరిని అర్థం చేసుకుని ఈ రెండు పార్టీలు దూరం జరుగుతున్నాయి అన్న మాట వినిపిస్తోంది. త్వరలోనే ఉత్తరప్రదేశ్ మరియు ఇతర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు వస్తుండడంతో.. విపక్ష కూటమి లో చీలికలు ఆసక్తికరంగా మారాయి.