వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నందిగ్రామ్‌లో పర్యటిస్తుండగా వాహన ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. అయితే తనపై దాడి జరిగిందంటూ సీఎం మమతా బెనర్జీ ఆరోపణలు చేశారు. అంతేకాదు.. తనపై హత్యాయత్నం చేశారని.. ఈ క్రమంలోనే తన కాలుకు దెబ్బ తగిలిందన్నారు. ఎన్నికల ప్రచారం కూడా ఆమె కాలుకు పట్టి కట్టుకుని వీల్‌చైర్‌లోనే ఉండి చేస్తున్నారు.
అయితే మమతా బెనర్జీపై జరిగిన దాడి ఘటన కేసును సీబీఐకి అప్పగించాలంటూ సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. అడ్వకేట్ వివేక నారాయణ్ శర్మ ఈ పిల్‌ను దాఖలు చేశారు. అయితే దీనిపై విచారణ జరిగిన సుప్రీంకోర్టు పిటిషన్‌ను తోసిపుచ్చింది. భారత ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బాబ్డే సారథ్యంలోని త్రిసభ్య బెంచ్ నిరాకరిస్తూ, పిటిషనర్ కోల్‌కతా హైకోర్టుకు వెళ్లవచ్చని పేర్కొంది.