కరోనా కట్టడిలో విఫలమయ్యారంటూ మోదీపై దేశం బయటా, లోపలా విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ ఏపీ సీఎం జగన్ ప్రధానికి బాసటగా నిలిచారు. కరోనాపై పోరాటంలో దేశమంతా ఆయనకు అండగా నిలవాలన్నారు. ముఖ్యమంత్రులు వినడం లేదంటూ జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ ట్వీట్ కు జగన్ స్పందించారు. కోవిడ్ పై దేశమంతా పోరాడుతున్న సమయంలో ఇలాంటి ఆరోపణలు, విమర్శలు ఎంతమాత్రం సరికాదన్నారు. రాజకీయ విమర్శలు జాతీయతను బలహీనపరుస్తాయని…ఈ సమయంలో అందరం ప్రధానికి అండగా బలంగా నిలబడాలనీ ట్వీట్ చేశారు.