అల్లా మాల్స్ ను ఇష్టపడడు కనుక ముస్లింలు మాల్స్ కు దూరంగా ఉండాలి…కేరళకు చెందిన ఓ ముస్లిం ప్రబోధకుడి ఆదేశమింది.మాల్స్ లో ఆడ, మగ కలిసి తిరుగుతారని…అలాంటివి అల్లా ఒప్పుకోడని అందువల్ల ఎవరూ మాల్స్ కు వెళ్లవద్దని హుస్సేస్ సలఫీ అంటున్నాడు. అల్లాకు ఇష్టమైన ప్రదేశాలు కేవలం మసీదులు మాత్రమేనట. మాల్స్ కు వెళ్లే మహిళలు బ్యూటీపార్లర్ లకు కూడా వెళ్తున్నారని ఆందోళనగా చెప్పాడు సలాఫీ. అక్కడకు వెళ్లే వాళ్లు వివిధ రకాల దుస్తులు ధరిస్తారని..అందులో ఉన్న ముస్లింలు సైతాన్ల పిల్లలని ముస్లిం సమాజ ప్రతిష్టను వారు దిగజారుస్తున్నారని కొత్త భాష్యం చెప్పాడు.
షాపింగ్ మాల్స్ ముస్లింలపై చెడుప్రభావం చూపుతోందని అన్నారు. అందువల్ల ముస్లిం మహిళలు, పురుషులు మాల్స్ కు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు.
ఇక ఇటీవలే ఇలాంటి పైత్యపు కూతలే కూశాడు మరో మతపెద్ద సిరాజుల్ ఇస్లాం. అత్తరు వంటి సౌందర్య లేపనాలు వాడే మహిళలు వ్యభిచారులతో సమానమని అన్నాడు. వ్యభిచారం చేయాలనుకునేవారు…వ్యభిచారం చేస్తున్నవారు మాత్రమే అత్తరు వాడుతారని అన్నాడు.