17 ఏళ్లు పైబడిన యువకులు తమ ఓటరు కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడానికి 18 ఏళ్లు నిండే వరకు వేచి ఉండాల్సిన అవసరం లేదని భారత ఎన్నికల సంఘం (ECI) ఈరోజు ప్రకటించింది. 17 ఏళ్లు నిండిన యువత ఓటర్ కార్డు కోసం ముందస్తుగా దరఖాస్తు చేసుకునేందుకు వీలు కల్పిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఇదివరకు జనవరి 1 నాటికి 18 ఏళ్ల వయసులోకి అడుగు పెట్టిన వారు మాత్రమే ఓటర్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలన్న నిబంధన ఉండేది. కానీ ఇప్పుడు అది ఒక సంవత్సరం ముందే చేసుకునేలా సౌలభ్యం కలిగించింది ఈసీ. దేశంలోని యువత ఓటర్ల జాబితాలో చేరేందుకు ప్రతి సంవత్సరం ఉన్న జనవరి 1 తోపాటు ECI మూడు అదనపు అర్హత తేదీ( ఏప్రిల్ 1, జూలై 1 సహా అక్టోబర్ 1)లను విడుదల చేసింది.
https://twitter.com/SpokespersonECI/status/1552529050089844736?s=20&t=Ctc4TzmPoFMzQHb-8hSkJA
కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారి రాజివ్ కుమార్, ఎలక్షన్ కమిషనర్ అనుప్ చంద్ర పాండేల నేతృత్వంలోని ఈసీఐ.. అన్ని రాష్ట్రాల ఎన్నికల కమిషనర్లు, ఈఆర్ఓ, ఏఈఆర్ఓలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో ప్రజల్లో అవగాహన కల్పించాలని తెలిపింది.