మలయాళ దర్శకుడు అలీ అక్బర్ మతం మారారు. ఇస్లాంను వీడి హిందూమతంలోకి మారి రామసింహన్ అయ్యారు.అలీ అక్బర్ తో పాటు ఆయన భార్య లూసియమ్మ కూడా హిందుత్వం స్వీకరించారు.
కల్నల్ బిపిన్ రావత్ మరణాన్ని వేడుకగా చేసుకున్న ఇస్లాంలో ఉండలేనని అక్బర్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
డిసెంబర్ 10ననే తాను ఇస్లాంను వీడుతున్నట్టు అక్బర్ ప్రకటించారు. నెలరోజుల తరువాత భార్యతో కలిసి ఘర్ వాపసీ వచ్చారు. గురువారం అధికారికంగా మతం మారిన ఆయన ఇకనుంచి తాను రామసింహన్ ను అని ప్రకటించారు.
1947లో ఇస్లామిక్ జిహాదీల చేతిలో హత్యకు గురైన వ్యక్తి రామసింహన్. రామసింహన్ తో పాటు ఆయన సోదరుడు దయాసింహం, ఆయన భార్య కమల, వారి వంటమనిషి రాజు అయ్యర్ కుటుంబసభ్యులను మలప్పురం జిల్లా మలపరంబలో దారుణంగా నరికి చంపారు.
రావత్ మరణాన్ని అపహాస్యం చేసిన ఇస్లామిస్టులను విమర్శిస్తూ అక్బర్ ఫేస్ బుక్ లో ఓ వీడియో షేర్ చేశారు. దీంతో ఇస్లామిస్టులు ఆయన్ని టార్గెట్ చేశారు. వరుస రిపోర్టులతో ఆయన ఖాతాను నిలిపేయించారు. మరో అకౌంట్ ఓపెన్ చేసిన అక్బర్..తాను ఇస్లాంను వీడుతున్నట్టు ప్రకటించారు. తన కుటుంబానికి ఇకనుంచి ఏ మతం లేదన్నారు. సరిగ్గా నెలరోజుల తరువాత హిందుత్వం స్వీకరించారు.