అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఎయిర్ ఇండియాను టాటా సన్స్ చేజిక్కించుకోనుంది.ఎయిరిండియా ప్రైవేటీకరణలో భాగంగా కీలక ప్రక్రియ పూర్తైంది. సంస్థను కొనుగోలు చేయడానికి టాటా సన్స్ తుది బిడ్ ను గెలుచుకుంది. స్పైస్ జెట్ ప్రమోటర్ అజయ్ సింగ్ కూడా బిడ్ వేసినప్పటికి, టాటాసన్స్ ఎయిర్ ఇండియా కొనుగోలు కోసం అధిక ఆఫరును సమర్పించారని కేంద్ర ప్రభుత్వ అధికారులు తెలిపారు. టాటాసన్స్ సమర్పించిన బిడ్ ప్రభుత్వ కమిటీ నిర్ణయించిన కనీస ధర కంటే 3000 కోట్ల రూపాయలు ఎక్కువ అని తెలిసింది. అయితే హోంమంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని నిపుణుల బృందం టాటా సన్స్ బిడ్ కు ఓకే చెప్పినా దీనిపై కేంద్ర ఆర్థిక శాఖ తుది ప్రకటన చేయాల్సి ఉంది. భారీనష్టాల్లో ఉన్న ఎయిర్ ఇండియా టాటాల చేతుల్లోనైనా లాభాల బాట పడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.