అగ్నిపథ్ పథకం కింద అగ్నివీర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్‌ను భారత సైన్యం విడుదల చేసింది. ఇండియన్ ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్, నేవీలో అగ్నివీర్ నియామకాల కోసం తేదీలను ప్రకటించింది. అగ్నిపథ్ రిక్రూట్మెంట్ పాలసీపై దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ నోటిఫికేషన్‌ను ఆర్మీ విడుదల చేసింది. రేపు(జూన్ 21) నేవీ అగ్నివీర్ నోటిఫికేషన్.. ఈనెల 24న ఎయిర్‌ఫోర్స్ అగ్నివీర్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ఈ ఏడాది జూలై నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయని పేర్కొంది. అగ్నిపథ్ రిక్రూట్మెంట్ పాలసీపై దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ నోటిఫికేషన్‌ను ఆర్మీ విడుదల చేసింది. ఇండియన్ ఆర్మీలో చేరేందుకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ రోజు నుంచే దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది.
https://twitter.com/MIB_India/status/1538769214466535424?s=20&t=B-dmSp5fsCouzOBZFG7acA
న్యూ రిక్రూట్మెంట్ స్కీమ్ తొలి రౌండ్ కోసం ఈ నోటిఫికేషన్ జారీ చేశారు. ఇండియన్ ఆర్మీలో డిస్ట్కింక్ట్ ర్యాంక్‌గా అగ్నివీర్ ఏర్పాటు చేసినట్టు తెలిపింది. ప్రస్తుతమున్న ఇతర ర్యాంకులకు ఇది భిన్నమని పేర్కొంది. నిరసనల జ్వాలలు రగులుతుంటే, కేంద్రం మాత్రం ఈ పథకం కింద నియామకాలపై తగ్గేదేలే అంటూ ముందుకు వెళ్తోంది.