అగ్నిపథ్ పథకాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తం అవుతున్నా దాని అమలుకే మొగ్గుతోంది కేంద్రప్రభుత్వం. అగ్నిపథ్ పథకం కింద నియామకాల ప్రక్రియను త్వరలో మొదలుపెడతామని ఆర్మీచీఫ్ మనోజ్ పాండే ఇప్పటికే ప్రకటించగా… ఎయిర్ ఫోర్స్ లో జూన్ 24 నుంచే నియామకాలు మొదలుకానున్నాయి ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి తెలిపారు. ఈ మేరకు వీడియో సైతం రిలీజ్ చేశారాయన. సాయుధ దళాల్లో చేరేందుకు కేంద్రం అగ్నిపథ్ పథకాన్ని తీసుకువచ్చిందని…17.5-21 ఏళ్ల మధ్య వయస్కులు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చని..అయితే కరోనా కాలంలో నియామకాలు చేపట్టనందును వయోపరిమితిని రెండేళ్లు పెంచడం అభినందనీయమని..జూన్ 24 నుంచే నియామక ప్రక్రియ మొదలవుతుందని ఆయన తెలిపారు.
ఇక అగ్నిపథ్ నిరసనల నేపథ్యంలో రైల్వే ఆస్తులను ధ్వంసం చేయవద్దని కోరారు కేంద్ర రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్.ఎలాంటి హింసాత్మక ఘటనలకూ పాల్పడవద్దని యువతకు విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అగ్నిపథ్ (Agnipath) పథకానికి నిరసనగా దేశవ్యాప్తంగా ఆందోళనలు, రైళ్లు తగుల పెట్టడం వంటి ఘటనలకు పాల్పడుతున్నారు యువకులు.