ఆఫ్గనిస్తాన్ ఇకపై ఇస్లామిక్ ఎమిరేట్ గా కొనసాగుతుందని తాలిబన్లు ప్రకటించారు. ఇవాళ దేశ 102 స్వాతంత్ర్యదినోత్సవాల సందర్భంగా ఈ ప్రకటన చేశారు. 1996-2001 మధ్య తాలిబన్ల ఏలుబడిలో ఆఫ్గన్ ఉన్నప్పుడు ‘ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆఫ్గనిస్తాన్’ గా పిలిచేవారు. 2001లో అమెరికా అక్కడ కాలుమోపాక ఇస్లామిక్ ఎమిరేట్ పదాన్ని తొలగించారు. తిరిగి ఆ దేశాన్ని స్వాధీనం చేసుకున్న తాలిబన్లు మునుపటిపేరునే ప్రకటించారు.