ఆఫ్గనిస్తాన్ నుంచి వచ్చిన శరణార్థులు డిల్లీలోని న్యూఢిల్లీలోని ఐక్యరాజ్యసమితి శరణార్థుల హై కమిషనర్ (UNHCR) కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. శరణార్థి కార్డులు, పునరావాసం, భారత్ సహా ప్రపంచ వ్యాప్తంగా తమకు భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.
భారత్ సహా, ఇతర దేశాల్లో తమకు ప్రాథమిక సౌకర్యాలు సహా విద్య, ఉద్యోగాల వంటివి అందుబాటులో లేవని ఆఫ్గన్ శరణార్థి ఒకరు అన్నారు. భారతదేశంలో దీర్ఘకాల వీసా (ఎల్టివి) కోసం దరఖాస్తు చేసుకోవడానికి ముందు…ఈ తమ మూడు ప్రధాన డిమాండ్లు వినిపించేందుకే అక్కడికి వచ్చినట్టు చెప్పాడు.
అటు ఆఫ్గన్ తాలిబన్ల కైవసం అయినదగ్గర్నుంచీ పెద్దసంఖ్యలో అక్కడి పౌరులు భారత్ కు వస్తున్నారు. అక్కడినుంచి ఆశ్రయం కోరుతూ వస్తున్న శరణార్థుల కోసం అత్యవసర ఇ- వీసాలను జారీ చేస్తామని ఆగస్టు 17నవిదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆఫ్ఘన్లందరూ, వారి మతంతో సంబంధం లేకుండా, ఆన్లైన్లో ‘ఇ-ఎమర్జెన్సీ ఎక్స్-మిస్ వీసా’ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులు న్యూఢిల్లీలో ప్రాసెస్ చేస్తారు. మంజూరు చేసిన వీసాలకు ఆరునెలల పరిమితి ఉంటుంది.