తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ పాలనలో మగ్గిపోతున్న పశ్చిమ బెంగాల్ లో ఒక కొత్త వివాదం వెలుగు చూసింది. మాల్దా జిల్లా లోని అదీనా మసీదు అసలు బండారం బయట పడింది. అది ఆదినాథ్ దేవాలయం అన్న వాదన బలంగా ఊపందుకొంది. తాజాగా అక్కడ కొందరు పర్యటించి ఆదినాథ్ దేవాలయం ఆధారాలను బయట పెట్టారు.
….
పశ్చిమ బెంగాల్లోని మాల్దా జిల్లాలో ఉన్న అదీనా మసీదు ప్రస్తుతం వివాదానికి కేంద్రంగా మారింది. ఈ స్థలాన్ని మసీదుగా రాజకీయ నేతలు చెబుతున్నప్పటికీ.. , స్థానికులు, చరిత్రకారులు, సంస్కృతి పరిశోధకులు మాత్రం ఇది అసలు ఒక హిందూ ఆలయం — ముఖ్యంగా “ఆదినాథ్ దేవాలయం” అని చెబుతున్నారు. కాలక్రమేణా ముస్లిం పాలన సమయంలో ఈ దేవాలయాన్ని మార్చి మసీదుగా ఉపయోగించారని వారు పేర్కొంటున్నారు.
….
అదీనా మసీదు కాదు, ఆదినాథ్ దేవాలయం అనేందుకు కొన్ని ఆధారాలు కనిపిస్తున్నాయి. ఈ భవనం వాస్తుశిల్ప శైలి, శిల్పాలు, గోడలపై ఉన్న రూపాలు హిందూ దేవాలయాలకు సంబంధించిన లక్షణాలు గా నిలిచాయి. అక్కడ శివలింగం ఆకారంలో ఉండే శిథిలాలు, శిల్పచిత్రాలు కనబడుతున్నాయి. . పూర్వకాలంలో అక్కడ పూజలు జరిగేవని, అది హిందూ ధార్మిక కేంద్రం అయి ఉండేదని స్తానికులు అంటున్నారు. అలాగే అక్కడ దొరకుతున్న శిథిలాలు హైందవ సంస్క్రతికి చెందినవి కావటం విశేషం.
……
భారత మాజీ క్రికెటర్, తృణమూల్ కాంగ్రెస్టీ-ఎంసీ ఎంపీ యూసుఫ్ పఠాన్ చేసిన ఒక సోషల్ మీడియా పోస్ట్ తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. అదినా లో ఉన్నది మసీదు అంటూ ఆయన పోస్టు పెట్టి వివాదాన్ని మరింత పెంచారు. ఇది ఆదినాథ్ దేవాలయం అని స్థానికులు చెబుతున్నప్పటికీ, మమతా బెనర్జీ దగ్గర మార్కులు కొట్టేసేందుకు యూసఫ్ పఠాన్ ఈ వివాదాన్ని తెర మీదకు తీసుకొని వచ్చారని తెలుస్తోంది.