ది కశ్మీర్ ఫైల్స్ చిత్రాన్ని కాశ్మీర్ పండిట్ల బాధ తెలిసినవారు.. తెలుసుకోవాలనుకునే వారు.. ప్రతీ భారతీయులు చూస్తున్నారు. ఆదిలాబాద్ లోని బోథ్ లో అక్కడి స్థానిక జాతీయవాదులంతా కలిసి కాశ్మీర్ ఫైల్స్ చిత్రాన్ని సామూహికంగా వీక్షించడానికి వెళ్లారు. ఇందులో తెలంగాణ ప్రభుత్వ అధ్యాపకుల రాష్ట్ర ప్రధానకార్యదర్శి బలరామ్ జాదవ్ పాల్గొన్నారు. కాశ్మీరీ పండితుల కన్నీటి గాథ, హిందువుల ఊచకోతను తప్పకుండా అందరు చూడాలని.. ఆదరించాలని అన్నారు. హిందువులు నిర్లక్ష్యం వదిలి ఐకమత్యంగా ఉండాలని పిలుపునిచ్చారు.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్‌స్క్రైబ్ చేయండి.)