తెలంగాణలో వరుసగా కురుస్తున్న వర్షాలకు కుంటలు, చెరువులు, కాల్వలు పొంగి పొర్లుతున్నాయి. ఇక అడవుల జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ లో ప్రాజెక్టులు నిండుకుండల్ని తలపిస్తున్నాయి. పొచ్చెర, కుంటాల వంటి జలపాతాలు, జిల్లాలోని ప్రాజెక్టుల్లో పరవళ్లు తొక్కుతున్న జలసిరులు తిలకించేందుకు పర్యాటకులు ఎగబడుతున్నారు.