ఆదిలాబాద్ సోనాలలో గోవులను అక్రమంగా తరలిస్తుండగా స్థానిక యువకుడు ఆడ్డుకున్నారు.
పెద్దసంఖ్యలో గోవుల్ని కబేళాకు తరలిస్తున్నారని వారికి సమాచారం అందింది. దీంతో రోడ్డుపైకి చేరుకున్న వారంతా వాహనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే డ్రైవర్ విహనాన్ని పక్కకు అపుతానని నమ్మించి రివర్స్ తీసుకుని తప్పించుకునే ప్రయత్నం చేశాడు. యువకులు అతన్ని తమ వాహనాలతో వెంబడించారు. సోనాల సమీపంలో గ్రామస్తుల సహకారంతో నిండా గోవులతో ఉన్న వాహనాన్ని పట్టుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి అందులో ఉన్న7 గోవులను రెండు వాహనాల్లో గుడిహత్నూర్ గోశాలకు తరలించారు.